చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, అది ఏంటంటే …సొంత ఇల్లు స్వర్గ సీమ లాంటిది అని…మరి స్వర్గం కి పైన ఏమి ఉండదు కదా…కాబట్టి…వీళ్ళంతా independent ఇల్లు అనేది apartment కన్నా చాలా బెటర్ అని అనుకుంటూ ఉంటారు, వీళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే…apartments అగ్గిపెట్టెల్లా ఉంటాయని….అక్కడ భూమి మనది కాదు , ఆకాశం మనది కాదు అని, మొక్కలు చెట్లు పెంచుకోడానికి కుదరదు అని…..ఇలా భూమి ఆకాశం ఫిలోసోఫి ని పట్టుకుని…వీళ్ళంతా city outskirts లో ఒక పెద్ద స్థలం చూసి, అక్కడ ఒక ఇల్లు కట్టుకుని …..నేను భూమి మీద నా స్వర్గసీమ ని నిర్మించుకున్నాను అని మురిసిపోయి….ఆ ఇంటికి ఒక పేరు పెట్టి …ఆ పేరుని ఇంటిముందు పెట్టించి ….తెగ ఆనంద పడుతూ ఉంటారు …కాని వాళ్ళకి తెలియదు “in front there is crocodiles festival” అని ….
1. స్థలం చవకగా వస్తుంది అని ….సిటీ మూలకి ఇల్లు కట్టడం వల్ల , రోజు ఆఫీసు కి వెళ్లి రావడానికి ఎక్కువ తిరగాల్సిన పరిస్థితి .
2. ఎక్కువ పెట్రోల్ ఖర్చు
3. పనిమనుష్యులు, ఇస్త్రీ చేసే వాళ్ళు దొరకడం కష్టం
4.city outskirts లో ముళ్ళు ఎక్కువ ఉండటం వల్ల, రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల, vehicles కి ఎక్కువ punctures పడుతుంటాయి ….
5. auto వాళ్ళు ఎవరు ఒక పట్టాన దొరకరు, ఒకవేళ దొరికినా మీటర్ వెయ్యడు
6. ఇంటి దగ్గర డొక్కు సినిమా హల్ల్స్ ఉంటాయి, వాటి తోనే సరిపెట్టుకోవాలి,
7.city outskirts లో పాముల భయం కాస్త ఉంటుంది, కాబట్టి పిల్లలు ఎక్కువ సేపు బయట ఆడుకోడానికి ఉండదు
8. దోమలు, ఇంట్లోకి కప్పలు దూరడం సర్వ సాధారణం
9. High speed internet ఈ దూర ప్రాంతాలకి ఒక పట్టాన రాదు
10. దొంగల భయం ఎక్కువ ( నా చిన్నప్పుడు residents అంతా వంతులు వేసుకుని రాత్రి పూట patrolling చేసేవాళ్ళు , నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళేవాడిని మా నాన్నతో )
11. సినిమా హల్ల్స్ బాగా దూరంగా ఉంటాయి…..దగ్గరగా ఉన్న వాటిల్లో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి (ఇప్పుడు మా దగ్గర కూడా మంచి హాల్స్ వచ్చయిలెండి )
12. ఇంటి దగ్గర మంచి స్చూల్స్ ఏమి ఉండవు, ఎండాకాలం లో ఏదన్నా musical instrument లాంటివి నేర్చుకున్డమంటే , ఎవరు ఉండరు దగ్గర్లో నేర్పేవాళ్ళు, అదే సిటీ లో ఉంటె ఈజీ గా ఉంటుంది …
13. ఇలా సొంత ఇల్లు కట్టగానే….మొక్కలు , చెట్లు పెట్టాలి అనే వింత కోరిక అందరికి మొదలు అవుతుంది ,….ఆ మొక్కలతో తో పాటు పెరట్లో గొంగళి పురుగులు, వేరు పురుగులు , చెట్టు మీద కాకి గూట్లో కాకి పిల్లలు పెరుగుతూ వాటి వాటి పద్దతులలో మనల్ని పలకరించి పోతూ ఉంటాయి…
14. రాత్రి ఇంటికి లేట్ గా వస్తే ….ఊర కుక్కలు ఒక లుక్ ఇస్తూ ఉంటాయి,
15. Friends తో డిన్నర్ కి అని బయటకి వెళ్తే…తొందరగా ఇంటికి బయలు దేరాలి….మళ్ళి అంత దూరం వెళ్ళాలి కదా
16. “అంత దూరం నుంచి వస్తావా ?” అన్న expression ప్రజలు ఇస్తూ ఉంటె భరించాలి
ఇంకా బోలెడు ఉంటాయి లెండి…ఇంటి దగ్గర సరయిన హాస్పిటల్స్ ఉండవు….ఇప్పుడు బెటర్ కానీ…ఒకప్పుడు అపోలో ఫార్మసీ కూడా దూరంగా ఉండేది బాగా…కాబట్టి…చక్కగా అపార్ట్మెంట్ జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని నా నమ్మకం
10 comments:
ఈ అవుట్ స్కర్ట్స్ ఇళ్ళల్లో మీరు చాలా అనుభవించి, మరీ చెప్పుతున్నారా అనేలా ఉందండీ.. మీ టపా. బాగుంది. కీప్ ఇట్ అప్.
చాలా బాగా రాసావు.నువ్వు పడ్డ కష్టాల జాబితా..చేంతాడంత ఉంది!
ఇది మాత్రం నిజం.ఊరు చివర సొంత ఇంట్లో ఉండటంకంటే..
ఊరిమధ్యలో..అద్దెకు ఉండటం సుఖం.కాని ఈ లాజిక్..పెద్దవాళ్ళకు
అర్ధం కాదు.చెప్పినా ఒప్పుకోరు.!
Enti sanju, topic emo independent house kashtalu ani raasav.....actually independent house in outskirts ani rayali.
Btw outskirts apartments lo unde vallaki kooda ave kashtalu. Infact vere kashtalu kooda untayi...for sample
-> Quality bagundadu....konni yrs tarwata edo oka prob start avutundi, leakages, cracks, etc
-> Water prob
-> Maids kosam competition
-> Evening ayindante pakkinti valla nundi calls, 'nenu ofc nundi ravadam late avutundi, ma babu/papa ni day care nundi techi mee intlo pettukondi mem vache varaku.
-> Leda bayataki veltu pillalni mana intlo vadili veltaru.
-> Roju intiki ni8 eppudo vastunte, adi chusina neighbours gossip start chestaru.
etc etc sanju...elanti chalane untayi.
I agree with sindhu's comments Sanju , నువ్వు అపార్ట్మెంట్ తీస్కోని చూడు, సిటీ మద్యలో అప్పుడు తెల్సుస్తాయ్ కష్టాలు
@raj and manasa... thankyou
@sindhu ... right sindhu....title marchi pettalsindi..
@vishal ... appudu apartment life kastalu ani inkoti rasukundam le...prastutaniki ayithe ive kastalu :)
ఇప్పటికైనా టైటిల్ మార్చండీ.. అందరూ అడుగుతున్నారుగా / అంటున్నారుగా..
ప్రజల కోరిక మేరకు మార్చడం జరిగింది ..hehe
Wow appatlo vamc ane vaadu naatho cheptu vunde vaadu....'SANJU IS ALWAYS RIGHT' ani :D
Caught u man...this time u r wrong n changed da title too :P :P :P
New line 'SANJU IS NOT ALWAYS RIGHT'
@sindhu ...ur suggestion abt title is more appropriate one, so i changed it...ade ego feel ayyi ..nene correct ani unte thats wrong...so i am right by accepting ur suggestion :)
Post a Comment