“వీడు జన్మభూమి Express కి Brand ambassador” ఈ మాట నేను సంవత్సరానికి రెండు మూడు సార్లన్నా వింటాను మా చుట్టాల దగ్గరనుంచి. హైదరాబద్ నుంచి వైజాగ్ వెళ్ళాలి అనగానే , అందరికి గుర్తొచ్చేది గోదావరి express. దానికి రిజర్వేషన్ తీసుకుని, బెర్త్ ఎక్కి, ఇంటి నుంచి డబ్బాలో తెచ్చుకున్న పెరుగన్నం ఇంత తిని, ఎదురుగుండా వాళ్ళతో కాసేపు మాట్లాడి, నిద్రపోయి, మధ్యలో బాత్రూం కి అని లేచి, ఆ నిద్రమత్తులో చెప్పులు వెతుక్కుని, ట్రైన్ లో వూగుతూ నడిచి, పొద్దునే లేచి వూగుతూ పళ్ళు తోముకోవడం , హైదరాబాద్ కి వైజాగ్ కి మధ్యలో ప్రయాణం అంటే ప్రజలకి ఉండే ఐడియా ఇది. వీళ్ళ దృష్టిలో ప్రయాణం అనేది ఒక టైం వేస్ట్ పని, కాబట్టి ప్రయాణాలు రాత్రి పూట పెట్టుకోవాలి అని. ఈ కాన్సెప్ట్ నాకు ఎప్పుడు నచ్చలేదు .నా పర్సనల్ ఛాయస్ మటుకు జన్మభూమి
ముందుగా రకరకాల మనుష్యులతో మాట్లాడే ఛాన్స్ వస్తుంది, రకరకాల మాండలికాలు, వాళ్ళకు రాజకీయాల మీద ఉన్న అభిప్రాయాలు, ఇలాంటివి తెలుస్తాయి, ఇంకా కొంతమంది అయితే..వల్ల ఫామిలీ విషయాలు కూడా చర్చిస్తారు. కాకపోతే unreserved లోనే వెళ్ళాలి, అప్పుడే ప్రతి గంట , రెండు గంటలకి కొత్త మొహాలు మన ఎదురుగా వస్తాయి ( మన wavelenght match అయ్యే వాళ్ళు ఉంటె బాగానే ఉంటుంది, మొన్న జూన్ లో అలానే ఒక ఫామిలీ మధ్యలో కూర్చొని ఇరుక్కు పోయా…పెళ్ళిళ్ళ సీజన్లో ఫ్లైట్ టికెట్స్ దొరక్క, వాళ్ళు దీన్లో వచ్చారుట…చిరాకు తెప్పించారు నాకు ). ఇంకా మధ్యమధ్యలో లో టీ, కాఫీ, సమోసా, …ఇవి కాకుండా పక్క వాళ్ళు, ఎదురుగ కూర్చొనే వాళ్ళు ఇచ్చే చేగోడీలు, జంతికలు లాంటి చిరుతిళ్ళు, …మరీ ఆకలి వేస్తె, IRCTC వాడి పులిహోర కానీ బిర్యాని కాని దొరుకుతాయి.
కాని అదే ప్రయాణాన్ని పగటి పూట చేస్తే ఇంకా ఎంజాయ్ చేయోచ్చు అని నా నమ్మకం.,..రాత్రి పూట ఏమి కనిపియ్యవు కాని, పగటి పూట ప్రయాణం లో ట్రాక్ కి అటు ఇటు ఉన్న పొలాలు, తోటలు, తాటి చెట్లు, రైల్వే గేటు దగ్గర వేచి చూస్తున్న ప్రజలు, వాగులు, మధ్య మధ్యలో కొండలు, గుట్టలు, అడవులు, …సిటీ లో కనిపియ్యవు కాని, పొలాల మధ్య లోంచి వెళ్తున్న కరెంటు తీగల మీద రామచిలకలు కూడా కనిపిస్తాయి, ఇవన్ని పగటి పూట ఏ ట్రైన్ లో ప్రయాణం చేసినా కనిపిస్తాయేమో కానీ, జన్మభూమి ప్రయాణీకులకి మాత్రం ….సరిగ్గా సాయంకాలం అయ్యే సరికి తూర్పు కనుమలు కనిపిస్తాయి. ఇక చీకటి పడుతూ ఉంది అన్న టైం కి లేచి వెళ్లి, footboard మీద ప్రశాంతంగా కూర్చొని , ఆ చలిలో కాఫీ తాగుతూ, తూర్పుకనుమలు చూస్తూ ఉంటె భలే ఉంటుంది, ఆ కొండల మధ్యలో అన్నవరం కొండ మాత్రం లైట్స్ వల్ల మెరిసిపోతూ ఉంటుంది…ఆ వ్యూ ఇంకా బాగుంటుంది…నేను దైవ భక్తుడని ఏమి కాదు కాని, ఆ మసక చీకట్లో, అన్ని కొండల మధ్యలో అన్నవరం కొండ చాలా బాగుంది అనిపిస్తుంది.ఇక దీనికన్నా ముందు వచ్చే గోదావరి బ్రిడ్జి, అక్కడి ఇసుక తిన్నెలు, బ్రిడ్జి రాగానే దాన్లో చిల్లర వేసి దండం పెట్టె ప్రజల గురించి చెప్పక్కర్లేదు కదా
దాదాపుగా 12 గంటల ప్రయాణం, easy గా ఒక పుస్తకం చదివేయ్య్యోచ్చు, ఏ తాపీ ధర్మారావు పుస్తకాలు కానీ , చలం పుస్తకాలు కానీ పట్టుకున్నమంటే 2 or 3 complete చేసేయొచ్చు, ఆ పుస్తకాలు కాస్త ఆలోచింపచేస్తాయి….ఎలాగు సెల్ సిగ్నల్ సరిగ్గా ఉండదు కాబట్టి…బయట ప్రపంచం మనల్ని పెద్దగా disturb చేయలేదు, కాబట్టి ప్రశాంతంగా ఆలోచించుకోవచ్చు
160 రూపాయలకి ఇంత fun ఉంటె, ఎక్కువ ఖర్చు పెట్టి మరీ ఇదంతా దూరం చేసుకోవాలా అనిపిస్తుంది. ఏదో ఆఫీసు లో సెలవులు దొరకని వాళ్ళకి కాని, నాలా నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళకి, ఖాళీగా ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం, …..అంటే ఒక ప్రాబ్లం ఉంటుంది ఈ జన్మభూమి లో …కూర్చుంటే కాళ్ళు పట్టవు, అదొక్కటే గోల …
కాకపోతే పెళ్ళిళ్ళ సీజన్లో మటుకు ఈ ట్రైన్ లో వెళ్ళకూడదు, ఒక్కో సరి కూర్చోడానికి సీట్ కూడా దొరకదు, నేను హైదరాబాద్ నుంచి అమలాపురం వరకు నిలబడి వెళ్ళా ఒకసారి …అంత rush గా ఉంటె , ఏమి ఎంజాయ్ చెయ్యలేము .
3 comments:
Baundi..
ee sari nenochinappudu.. ee trip okati plan cheddam.. :)
నేను ఒకసారి పెళ్ళిళ్ళ టైం లో వైజాగ్ to వరంగల్ వచ్చి చచ్చిపోయా నరకం అనుభవించా urgent ఉంది అని రిజర్వేషన్ చేస్కోలే ఆ రోజు
@vamsi...sure
@vishal....hehe
Post a Comment