ఎప్పటినుంచో చదువుదాం అనుకున్న పుస్తకం, ఒకసారి కొన్నా కూడా, మా ఫ్రెండ్ కొట్టేసాడు నా దగ్గర నుంచి. చివరికి ఇంకోళ్ళ దగ్గర అప్పు తీసుకుని చదివా.
May be, ఒక పదేళ్ళ క్రితం చదివితే బాగా నచ్చి ఉండేదేమో. అంటే అప్పట్లో నేను "మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ", "అందరు స్వార్థపరులే", "ప్రజలంతా శ్రుంగారాన్ని, ఆకర్షణని , మొహంని ప్రేమ అని అంటారు ", "మనిషిని మనిషి పీక్కుని తినే రోజులివి " , "అనుబంధం ఆప్యాయత అంతా ఒక బూటకం " అని తెగ నమ్మే వాడిని. ఈ పుస్తకం చదువుతుంటే అప్పట్లో నా ఆలోచలనలు గుర్తొచ్చి నవ్వుకున్నా. ఒక మనిషిలోని చెడుని మాత్రమే చూసి, ఒక్క సంఘటనకే కదిలిపోయి, ఆవేశం లో మానవాళి మొత్తం అంతా ఇంతే అని generalize చేసే రోజులవి.
సరే పుస్తకం విషయానికొస్తే, ఒక్కోచెడు సంఘటన తీసుకోడం, అందరు అంతే చెబుతూ ఒక generalization. దాని మీద ఒక quotation. ఒక పుస్తకం చదువుతూ , పెన్ను తో underline చేసే అలవాటు ఉన్నవాళ్ళకి, కనీసం రెండు పెన్నుల్లో ఇంకు అయిపోతుంది. అన్ని quotations ఉన్నాయి.
అలా మన హీరో గారు, ఒక సంఘటనని సిగరెట్ తాగుతూ కిటికీ లోంచి చూస్తూ, అయన విశ్లేషణ అయన చేసేస్తూ, ప్రజలకి బోధిస్తూ , ఎవరు తనని ప్రేమించకుండా తనకు దగ్గరకి రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్న సమయం లో , అయన తల్లి మరణించడం, తర్వాత ఒక ముర్దర్ కేసు లో ఇరుక్కోడం, కోర్ట్ లో వాళ్ళు కూడా అచ్చం ఈయన లాగే, అసలు కథ ఏంటి అని పక్కన పెట్టేసి, తల్లి మరణిస్తే ఏడవలేదు, తల్లి మరణిస్తే సిగరెట్ తాగాడు, అన్న విషయాలు పట్టుకుని, ఈయన పర్సనాలిటీని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తూ వాదోపవాదాలు చేసేసుకుంటూ ఉంటారు. ఆ కేసు లోంచి బయటపడతాడు, పిల్లలు సంసారం సాగుతూ ఉంటాయి, ముసలితనం వచ్చేస్తుంది, ఆయన్ని బ్రతికుండగానే కొడుకులు ఎలా వదిలించుకున్నారు ( అప్పట్లో ఈ థీమ్ బాగా సాగేది, ముసలితనం లో తల్లిదండ్రులని పట్టించుకోని కొడుకుల గురించి ), ఎలా ఆయన్ని శవం అని చూపించి ఒక బిచ్చగాడు లాభ పడ్డాడు ఇలా ఇలా ఇలా సాగింది. సరే, ప్రపంచం లో ఉన్న చెత్త అంతా చూపించేసి , ప్రపంచమే ఒక చెత్త బుట్ట అన్న పాయింట్ చెబుదామని అనుకున్తున్నదేమో అనుకుంటే, చివర్లో , అంతా తూచ్, ప్రణవి కనబడి నా కళ్ళు తెరిపించింది, ప్రపంచం చేత్తమయం కాదు, ప్రేమమయం అనేస్తాడు, పోన్లే చివర్లో అన్నా కాస్త పాజిటివ్ గా రాసాడు అనుకుంటే , ఒక పారాగ్రాఫ్ తో మళ్ళి చిరాకు తెప్పించాడు.
" ఒకప్పుడు మనుషులు ఇలా ఉండేవారు కాదు, కొంచం ప్రేమ, కొంచం ఆప్యాయత, కొంచం నిస్వార్థం ఉండేవి. నీ ప్రతినిధిగా నేను వెళ్లి చూసిన ఆ ప్రపంచం ఎంత దారుణంగా ఉందొ దేవుడువి అయిన నీవే వూహించాలేవు. అందుకే ....నాకు ఇస్తున్న వరంగా...నా పట్ల ప్రణవి చూపించిన ప్రేమని మనుషులందరి మనస్సులో ప్రవేశపెట్టు. ఏ నిస్వార్థంతో ఆమె మరణించినదో ...ఆ 'అంశ' ని మనుష్యులల్లో కొద్ది కొద్దిగా నింపు " ....
దేవుడు ఒప్పుకుంటాడు, వెంటనే ప్రక్రుతి పులకిస్తుంది.
ఒకప్పటి ప్రజలు ఇప్పటి కన్నా నీతి మంతులు, మంచి వారు, ప్రేమించే గుణం ఉన్నవారు, ఏంటో ఈ చెత్త మాటలు అనిపిస్తుంది. ప్రస్తుతం సమాజం లో ఉన్న చెడుని చూసి, ఆ చెడు ఈ కాలం లోనే పుట్టింది అనడం సరి కాదు అనిపిస్తుంది. చెడు అనేది ఎప్పుడు ఉంది, అలాగే మంచి కూడా. మంచిని చెడుని కాలం విడదీయలేదు కదా. 2012 వరకు అంతా మంచి , 2012 తర్వాత అంతా చెడు అంటూ. వాటి రూపం మారుతూ ఉండొచ్చు. మాదకద్రవ్యాల సమస్య నల్లమందు కాలం నుంచి ఉంది. ఒక వ్యక్తిని చంపడం, దొంగతనం, మోసం చెయ్యడం అనేవి నాగరికతో పాటు మొదలయినవే. నిత్యానంద లాంటి దొంగ స్వాముల గురించి గురజాడ ఎప్పుడో కన్యాశుల్కం లోనే రాయడం జరిగింది. అలాగే illicit relationships కూడా అదే పుస్తకం లో చెప్పడం జరిగింది. భరతం లో ఇలాంటి వాటి మీద పిట్ట కథలు ఉన్నాయి. ప్రస్తుతం మన జీవితం దుర్భరంగా ఉంది, ప్రస్తుత సమాజం కుళ్ళి పోయింది లాంటివి నచ్చుతయనుకుంటా, ఇదే పాయింట్ మన న్యూస్ చానల్స్ కూడా బాగా వాడుకుంటున్నాయి.
ఏది ఏమయినా , దీనికన్నా యండమూరి ఆనందో బ్రహ్మ చాలా మంచి పుస్తకం అనిపించింది.

5 comments:
asamarthuni jeevayathra chadivara, thappakunda chadavandi,
antharmukham lo aa polikalu bhaga kanipisthay, gopi chand gari style kooda,
thank you, keep writing & reading.
యండమూరి నిర్వహించిన అంతర్ముఖం అనే టీ.వీ ప్రోగ్రాం చూస్తే, మీ ఇప్పటి అభిప్రాయాలతో యండమూరికి పూర్తి ఏకీభావం ఉందని మీకు అర్ధం అవుతుంది :)
@the tree .... thanks for the comment, yes, i have read that one, but i dont think these two books can be compared.
@mauli ... చివరికి యండమూరి కి నాలా ఆలోచించే maturity వచ్చిందన్నమాట :P
o, sorry andi nenu choodaledadi.
Albert camus di outsider/ the stranger oka sari chadavandi.....
Post a Comment