Wednesday, June 20, 2012

అసమర్థుని జీవయాత్ర

అదేంటో, ఈ చిన్న పుస్తకాన్ని ఎన్ని సార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. మొదటిసారి చదివాకా కాస్త confusion వచ్చింది, ఈ పుస్తకం బాగుందా బాలేదా అని. రెండో సారి చదివాకా ఇది చాలా గొప్ప పుస్తకం అనిపించింది. కాకపోతే ఏమిటా గొప్ప అన్న విషయం లో clarity లేదు. మూడో సరి చదివాక కొంచం వచ్చింది.

రచయిత గోపీచంద్ గారు,ఈ పుస్తకాన్ని చాప్టర్లు గా విడగొట్టారు కాని, మొత్తం పుస్తకం లో చివరి 20 పేజెస్ వరకు ఒక భాగం , మిగతా 20 పేజెస్ ఒక భాగం గా చూస్తా నేనెప్పుడు.

మొదటి  భాగం అంతా ఒక ధనవంతులఇంట్లో పుట్టి, తాను చేసిన సాయాలకి అందరు పొగుడుతూ ఉంటె అది అలవాటయ్యి, పేదరికం వచ్చి ఆ పొగడ్తలు లేకపోవడం వల్ల బాధపడుతున్న ఒక వ్యక్తీ గోల.  పేదరికపు కష్టం కన్నా ,ధనం లేకపోవడం వల్ల పొందలేకపోతున్న సుఖాలని, మర్యాదలని తలచుకుని బాధపడుతూ, ఆ బాధని భార్య మీద, కూతురి మీద ఆగ్రహం రూపం లో ప్రవహిమ్పజేస్తూ , భార్యాపిల్లల మీద కోపం వాళ్ల మీద ఉన్న ప్రేమ వల్లే వస్తోందని, కోపం వచ్చేంత ప్రేమ పుట్టడానికి తనకున్న మెత్తటి మనసే కారణం అనుకుంటూ, తన తప్పుల్ని మర్చిపోడానికి, వేదాంతం, ఆధ్యాత్మికం, మనవ సంబంధాలు అన్న విషయాల గురించి ఆలోచిస్తూ, వాటినే తన స్నేహితులతో మాట్లాడుతూ, కనీసం అలా అన్న తన తెలివిని సమాజం గుర్తించి , ఒక గుర్తింపు ని, కాస్త పొగడ్తని పడేస్తుంది అనుకుంటూ, అలా జరగకపోవడంతో, బహిరంగం గా అందరి తప్పుల్ని బయటపెట్టి, అందర్ని విమర్శిస్తే , అప్పుడయినా గుర్తింపు వస్తుంది అని ప్రయత్నాలు మొదలు పెడతాడు.

అలా అని కథానాయకుడు వెధవ కాదు, తన ప్రవర్తన వాళ్ల ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు అని మధ్య మధ్య అర్థం అవుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే ప్రేమ ప్రదర్శిస్తాడు. వెంటనే వాళ్ళు కూడా ప్రేమని చూపించాలని ఆశిస్తాడు.  ఇతను చూపిస్తున్న ప్రేమ, నిజమయిన ప్రేమ అని, దానిని అర్థం చేసుకుని, అంతకు ముందు అతను తిట్టిన, కొట్టిన సంఘటనలు మర్చిపోయి, ఇతని పట్ల ప్రేమ పుట్టడానికి పట్టే సమయాన్ని ఇంట్లో మనుష్యులకి ఇవ్వకుండా, నేను ప్రేమగా ఉన్నా, వెళ్ళు నా పట్ల ప్రేమగా ఉండరు అని కోపం తెచ్చేసుకుని ఇంకాస్త రచ్చ చేస్తుంటాడు.

ఇటువంటి ప్రవర్తన , మనకేప్పుడన్నా ఉందా లేక  మన స్నేహితులలో ఎవరికీ ఉందా అన్న ఆలోచన పూర్తయ్యేలోపే, అతని స్నేహితుల స్వభావాల మీద చర్చ మొదలవుతుంది. మన హీరో కి ఉండే స్నేహితులు మనందిరికి ఉన్నారు. స్నేహితుల గురించి రాసిన పేజెస్ బాగా ఎంజాయ్ చేస్తా ఎప్పుడు చదివినా.

భార్యని కొట్టాక ,మన హీరో కి ఉన్న వేప  కాయంత వెర్రి, పుచ్చాకయంత పిచ్చి అవుతుంది. పిచ్చి వాడిలా మాట్లాడటం మొదలు పెట్టడం , అందరి పిచ్చి ప్రశ్నలు వేయడం మొదలు పెడతాడు. ఇది అంతా మొదటిభాగం. ఈ భాగం గొప్పతనం ఏమిటంటే, ఇంకోళ్ళ కన్నా తను మెరుగు, అని నిరూపించడానికి మనిషి చేసే ప్రయత్నాలన్నీ దీన్లో ఉన్నాయి.

ఇప్పుడు రెండో భాగం మొదలవుతుంది. దీన్లో మొత్తం గా రామయ్య తాత మన హీరో కి పీకే క్లాస్సే ఉంటుంది. కాని సమాజాన్ని అర్థం చేసుకోడానికిఈ భాగం బాగా పనికి వస్తుంది. ముఖ్యంగా సంఘం కుల్లిపోయింది అని నమ్మే వాళ్ళు చదవాల్సిన పార్ట్ ఇది.  చెంప మీద గట్టిగా కొట్టినట్టు చెప్పే పాయింట్ ఏంటంటే " change in the society is never linear and never uniform" .  ప్రస్తుతం సమాజం లో ఉండే విభిన్న ధ్రువాల్ని అర్థం చేసుకోడానికి ఈ పాయింట్ బాగా పనికి వస్తుంది.

తరువాత, సమాజం లో  "మార్పు " అనుసరించే మార్గం వివరిస్తారు. మార్పు కావాలి అన్నప్పుడు మొదటగా మనం చేసేది, అప్పటి దాగా ఉన్న దాన్ని తెగ తిట్టడం. మార్పు రాగానే , ప్రపంచం పూలవనం లా తయారవుతుంది అని ప్రచారం చెయ్యడం. కొన్ని పేజెస్ వీటి మీదే చర్చ సాగింది.

తర్వాత, ప్రక్రుతినుంచి తప్పించుకోడానికి సమాజం ఏర్పడటం, సమాజం ని నిలబెట్టడం కోసం, దానికొక దిశ కల్పించాదానికి మనిషి ప్రయత్నించడం, సమాజం వ్యక్తీ స్వభావాన్ని ఎలా మారుస్తుంది,అన్న విషయాలు వివరిస్తాడు. ఈ వివరణ లో బాగా గుర్తుపెట్టుకోవలసిన లైన్ " సంఘాన్ని ముక్కలుగా కాకుండా , మొత్తం గా చూడటం నేర్చుకో " .

ఈ  పీకిన క్లాసుకి , మన హీరో నమ్మకాలు ఎర్రగా కాలాయి,తర్వాత మన హీరో నీడ, తల్లి దండ్రుల ఆత్మలు, ఇంకొన్ని ఊహలు, దెయ్యాలు అన్ని కలిసి, ఎర్రటి ఇనుప కద్దీల్లా ఉన్న నమ్మకాల మీద సమ్మెట దెబ్బలు వెయ్యడం మొదలు పెడతాయి. తను నమ్మింది తప్పు అని తెలుసు, కాని సరి అయిన దారిలో వెళ్ళాలంటే, నమ్మకాన్ని వదిలిపెట్టాలి, అలా వదిలి పెట్టడం కష్టం, ఈ కష్టం కి కారణం తనే తండ్రే అని, ఆయన్ని కాసేపు తిడతాడు, కాని , నమ్మకాలని మార్చుకోడానికి మనసు వెంటనే అంగీకరించదు. ఈ హడావిడిలో మన హీరో బాల్చి తన్నేస్తాడు. అదీ కథ.

ఏంటో, ఈ పుస్తకం ఎన్ని సార్లు చదివినా, మళ్ళి కొత్తగానే ఉంటోంది, ఎంత ఆలోచించినా, ఇంకో కొత్త ఆలోచన వస్తూనే ఉండుంది.



 

4 comments:

భాస్కర్ కె said...

one of my fevaret book, meere chakka ga parichayam chessesaaru.
keep writing.
thanking you sir.

ప్రేమిక said...

hmm nenu coment pettadam manesi chala rojualindi blogs lo.. kani this is my favourite book.. ee book chaivaka bhayamesindi.. much influenced me

Anonymous said...

తెలుగు లో ఉన్న అత్యుత్తం పుస్తకం ఇది. నేను దాదాపుగా వంద సార్లు చదివాను. ప్రతి సారి ఒక కొత్తగా అనిపించడం ఈ పుస్తక ప్రత్యేకత.నేను ఎవరన్న పుస్తకం సజెస్ట్ చెయ్యమంటే చెప్పే మొదటి పుస్తకం ఇదే. గోపీచంద్ గారి అత్యుత్తమ ప్రతిభకి నిదర్శనం ఈ పుస్తకం.

Rajesh R said...

Malla chadavalani undi ra.. kani book ledu :)