ఈ పుస్తకం గురించి నాకు చాలా మంది చెప్పారు ...2006 నుంచి ఈ పుస్తకం చదువుదాం అనుకుంటే ఇప్పటికి కుదిరింది ...అసలు పుస్తకం పేరు "confessions of an economic hitman" నేను తెలుగు అనువాదం చదివాను ...సింపుల్ గా చెప్పాలంటే anti-Americanism...అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని దేశాలని అమెరికా ఎలా నాశనం చేస్తోంది అన్నది concept. దాన్లో మన కధానాయకుడు ఒక దేశాన్ని ఎలా నాశనం చెయ్యాలో సలహాలు ఇచ్చే hitman అని చెప్పుకుంటాడు.
ఒక దేశం తన అభివృధికి అప్పు కావాలి అని ప్రపంచ బ్యాంకు ని అడిగినపుడు ...ప్రపంచ బ్యాంకు కి ఒక నివేదిక కావలి ..ఆ దేశం మీద...ఆ దేశం లో వనరులు ఏమున్నాయి? ఆ దేశం అభివ్రుది కావాలంటే ఆచరించాల్సిన ప్రణాళిక ఏంటి ? ఏ పనులకి అప్పు ఇవ్వొచ్చు ...ఇలాంటివి !!
ఒక దేశం అభివ్రుది చెందాలంటే ఎం కావాలి ...ఏమున్న లేకపోయినా ...ముందు విద్యుత్ కావాలి ..మన hitman ఒక జలవిద్యుత్తు ప్రాజెక్ట్స్ నిర్వహించే కంపెనీ లో ఉద్యోగి ... ఆ కంపెనీ లో ఉద్యోగం రావాలి అంటే "national security agency" వాళ్ళ interview clear చెయ్యాలిట..కానీ ఇతను పని చేసేది మటుకు ఒక ప్రైవేట్ కంపని గా చూపిస్తారు ...అంటే అమెరికా ప్రభుత్వం ఒక దేశాన్ని కొల్లగొట్టాలని fix అయ్యాక, national security agency వాళ్ళ చేత interviews చేయించి , ఒకతన్ని select చేసి (అంతకు ముందు అమెరికన పోలీసులకి అబద్ధాలు చెప్పిన వాళ్ళాకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అన్నట్టు పుస్తకం లో చెప్పారు ) ఒక NSA లో కాకుండా అతనికి ఇంకో కంపెనీ లో ఉద్యోగం ఇప్పించి ..ప్రపంచ బ్యాంకు కి కావలసిన నివేదిక అప్పగించాల్సిన బాధ్యత ఆ కంపెనీ కి ఇచ్చి ...ఇతన్ని ఆ దేశానికి పంపించి...అక్కడ విద్యుత్ ఉత్పాదన కి అనుకూలమైన అంశాలు ఇతను నివేదిక లో ఇస్తే ..అప్పుడు ప్రపంచ బ్యాంకు ఆ దేశానికి అధిక వడ్డీకి అప్పులు ఇస్తే ..ఆ వచ్చిన డబ్బుతో ఆ దేశంలో విద్యుత్ ఉత్పాదన చేయడానికి కాంట్రాక్ట్స్ ని అమెరికా లో ఉండే కంపెనీలకే ఇప్పించి ..అలా ఆ ధనాన్ని మళ్లి అమెరికా కి చేరవేసి..దీని పైన ఆ దేశం నుంచి వడ్డీ లాగి ...ఇక దేశ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసి ..ఆ దేశాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం.
ఈ మొత్తం process లో మొదటి నివేదిక ని అందచేయడం మన hitman పని....రచయిత hitman గేమ్ ని బాగా ఆడేవాడు అనుకుంట ఆ పేరు పెట్టుకున్నాడు ...నిజానికి hitman అన్న పేరు ఇక్కడ set అవ్వలేదు ..hitman అంటే ఫలానా మనిషిని ఎవ్వరికి తెలియకుండా చంపేసే వాడు అని అర్థం ...ఆ మనిషి ఎవరిన కావొచ్చు...కానీ ఇక్కడ అప్పు కావలి అని ఒక దేశం ప్రపంచ బ్యాంకు ని request చేస్తుంది ...అంతే కాని ప్రపంచ బ్యాంకు తానె స్వయంగా ప్రతి దేశం కి నీకు అప్పు ఇస్తా నీకు అప్పు ఇస్తా అంటూ వెంటపడదు ...కాబట్టి నా లెక్క ప్రకారం ఇక్కడ సరైన పేరు , సహాయం కోసం వస్తే ఇంకా ముంచేసే వాడు అన్న అర్థం తో వస్తే ఇంకా బాగుండేది ...తెలుగు లో పేరు సరిపోయింది ...దళారి అని.
ఇక పుస్తకం అంతా అమెరికా ఎంత చెడ్డదో వివరిస్తాడు ....అమెరికా చుట్టుపక్కల దేశాలలో ఏ దేశ నాయకుడు చనిపోయిన ..దాన్లో అమెరికా పాత్ర ఉందని indicate చేస్తాడు ...రాసిన వాటిల్లో ఎన్ని నిజాలు ఉన్నాయో నాకయితే తెలియదు ...కానీ అతను చెప్పిన విషయాలు చాల వాటికి ఆధారాలు మటుకు దొరకవు ...probably దుష్ట అమెరికా ప్రభుత్వం ఆధారాలు వదలదేమో ... ఏమో!!
కానీ కొన్ని అంశాలు మటుకు చిరాకు తెప్పించాయి ...ఉదాహరణకి ...బుష్ కుటుంబానికి, సౌది రాజు కుటుంబానికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవని ,అందుకే అమెరికా-సౌది సంబంధాలు బలంగా ఉండేవని అంటాడు, దానికి సాక్ష్యం గా vanity fair magazine లో పడిన ఒక article ని quote చేస్తాడు ...vanity fair అనేది ఒక fashion magazine..international politics లో ఒక fashion magazine లో పడిన article ఎంత వరకు reliable??
అలాగే ఒక దేశం లో గిరిజనులు hydro-electric ప్రాజెక్ట్ ని అడ్డుకోడానికి ప్రయత్నిస్తారు ...ఎందుకు అంటే ..ఆ ప్రాజెక్ట్ వాళ్ళ వచ్చే కాలుష్యం వాళ్ళ నివాసలని నాశనం చేస్తుంది అని ...ఒక జలవిద్యుత్ ప్రాజెక్ట్ నుంచి కాలుష్యం రావడం ఏంటి? turbine మీద నీళ్ళు పడితే ఆ నీల్లేమి పాడైపోవు కదా...
ఇక అమెరికా మాట వినని ఏ దేశ అధ్యక్షుడు అయినా మరణిస్తాడు అన్నట్టు మాట్లాడతాడు ...ముఖ్యంగా విమాన ప్రమాదాలలో ..విమానం లో బాంబు పెట్టించి చంపించేస్తుంది అని ...మరి స్టాలిన్ కాని చైనా లో మావో కానీ విమాన ప్రమాదాలలో చనిపోలేదు ఎందుకు?
ఇక అమెరికా ఏ దేశానికి సహాయం చేస్తునట్టు నటిస్తుందో ..ఆ దేశాన్ని పీల్చి పిప్పి చేసి కాని వదలదు ...మరి దక్షిన కొరియా one of the four asian tigers( The Four Asian Tigers or Asian Tigers are the highly developed economies of Hong Kong, Singapore, South Korea and Taiwan.) ఎలా అవ్వగాలిగింది ??
ఇరాక్ విషయం లో సద్దాం దగ్గరున్న bio-weapons గురించి అస్సలు మాట్లాడకుండా ..తప్పు మొత్తం అమెరికా మీద ..UN మీద తోసేయ్యడానికి బాగా ప్రయత్నించాడు..
బిన్ లాడెన్ కి సౌది ద్వారా అమెరికానే డబ్బు సరఫరా చేసి USSR మీద కి ఉసిగోల్పిందని రచయిత చెబుతాడు ...నిజానికి ఆల్ ఖైదా ఇరాన్ లో ఉన్న అమెరిక ఏమ్బస్సి ని పెల్చేయడం తోనే పనులు మొదలు పెట్టింది ....USSR కి against గా అమెరికా అఫ్ఘన్లకి కి బహిరంగంగానే ఆయుధాలు సరఫరా చేసింది ...అది USSR కూలిపోక ముందు సంగతి !!
USSR కూలిపోడానికి కూడా అమెరికానే కారణం అంటాడు రచయిత ...నిజానికి 1991 లో ussr లో ఒక poll conduct చేసారు ..దాన్లో 80% USSR జనాభా participate చేసింది ...ఈ 80% లో 76% తమకు ussr వద్దని...వ్యక్తిగత హక్కులకు ప్రాధాన్యం ఇచ్చే వేరు వేరు దేశాలు కావాలని వోటు వేసారు ...వీళ్ళందరికీ అమెరికా ప్రభుత్వం డబ్బులు ఇచ్చి USSR కూలిపోయెలా చేసిందా?
ఈ విషయాలు చదివి ఈ పుస్తకం లో హాస్యం లేదు అనుకోకండి ... అది కూడా పండించాడు ...ఈక్విడార్ లో అమెరిక సైనికులు అక్కడి ఆడవాళ్ళని చేరిచేసి, అడ్డదిడ్డంగా మరుగుదొడ్లు కట్టేసి ...తర్వాత జిలిటెన్ స్టిక్స్ తో చేపలు పట్టుకున్నరుట ...జిలిటెన్ స్టిక్స్ తో చేపలు పట్టడం ఏంటో...చేతికి అందక కొబ్బరి కాయలు కోయడానికి missiles వాడారేమో !!
ఇక మన hitman లో అమెరికా లో 11/9 న WTO భవంతులు కూలిపోయిన రెండు నెలలకి అక్కడికి "ఉత్సాహంగా" నడుచుకుంటూ వెళ్ళడంట ...ఉత్సాహం గా వెళ్లడం ఏంటో...అసలు రచయిత కూడా అదే పదం వాడాడా? లేక తెలుగు అనువాదం లో అల జరిగిపోయిందో ..తెలియదు ..
కానీ పుస్తకం చివరలో ఒక మంచి విషయం చెప్పాడు ...shopping చేయాలి అనిపించినప్పుడల్లా ధ్యానం చెయ్యమని.
మొత్తానికి ఆ పుస్తకం పూర్తి చేసాను ...globalization జరిగే నష్టాలలో ఎప్పుడు అమెరికా మాత్రమే ఎందుకు ఉంటుందో అర్థం కాదు ... రష్యా - చెచన్య , రష్యా-చేకస్లోవేకియా , చైనా-ఉత్తర కొరియా , చైనా - ఉత్తర వియత్నాం , చైనా-టిబెట్ ప్రసక్తి ఎందుకు రాదు?
ఈ సారి ప్రజాశక్తి బుక్ హౌస్ కి వెళ్తే ...USSR ఎందుకు విచ్చిన్నం అయింది ...china లో tiananmen square ఉదంతం మీద కాని,solidarity మీద కాని,చైనా ఎందుకు FDI విధానాన్ని అనుసరిస్తోంది, మావో మరణించిన వెంటనే ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ లో మార్పులు ఎందుకు వచ్చాయి,బెర్లిన్ గోడ ఎందుకు కట్టవలసి వచ్చింది? ఒక కమ్మ్యునిస్ట్ దేశం లో వ్యక్తీ గత హక్కులు ఎందుకు ఉండవు అనే అంశం మీద, మీడియా కి స్వతంత్రం ఎందుకు ఉండదు అన్న విషయం మీద పుస్తకాలూ ఎమన్నా ఉన్నాయేమో చూడండి ...దొరకడం కష్టం !! anti-Americanism అనండి ...ఒక కట్ట పుస్తకాలు ఇస్తాడు ..
అమెరికా ని తిట్టిన వాడిని నేను విమర్శించాను కాబట్టి నేను అమెరికా కి supporter ని అనుకోకండి, అలా అని అమెరికా చెడ్డది కాబట్టి చైనా మంచిది అంటే నేను ఒప్పుకోలేను ...
నా support ఎప్పుడు వ్యక్తీగత హక్కులకే ....ఈ పుస్తకాన్ని ఒక అమెరికన్ రాసాడు ...అది అమెరికా లోనే ప్రింట్ కూడా అయింది...ఆ రచయిత అమెరికా ని తిడుతూ ఇంకా చాలా పుస్తకాలు రాసాడు...అక్కడ వ్యక్తిగత హక్కులు ఉన్నాయి ...అదే ఒక చైనా వాడు కమ్మ్యునిస్ట్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఒక పుస్తకం రాయడానికి అవకాశం ఉందా?
వీలుంటే google లో tankman అని కొట్టి చూడండి ....మనకి వచ్చే search results చైనా లో ఉండి search చేస్తే రావు ...చైనా-గూగుల్ గొడవకి ఇది కూడా ఒక కారణం!!!