Saturday, January 29, 2011

నాకు ఈ మధ్య బాగా నచ్చిన బ్లాగులు

 

ఉలికి పిట్ట : ఎప్పుడు అమ్మాయిల మీద , అమ్మ మీద, ప్రకృతి మీద, ప్రేమికుల విరహాలు బాధల మీద కవితలు చదివి చదివి చిరాకేసింది…ఇతను మటుకు social issues మీద రాస్తున్నారు….social issues అంటే…పేదల కస్టాలు, కులం మీద మతం మీద మాత్రమే అనుకునేరు …చెత్త సినిమా సమీక్షాల దగ్గర నుంచి మొన్న UP లో ఒక MLA ఒక దళిత అమ్మాయిని రేప్ చేసిన విషయం దాకా అన్ని విషయాలు గురించి కవితలు ఉన్నాయి….…

http://ulikipitta.wordpress.com/

డింగిరి :  ఒక సారి సాక్షి వ్యాసాల్లో చదివా ( సాక్షి వ్యాసాలు అంటే జగన్ రెడ్డి సాక్షి పేపర్ లో వ్యాసాలు కాదు నేను అంటోంది…పానుగంటి గారి “సాక్షి వ్యాసాలు” ) అసాంఘిక పనులు చేసే వారికీ సరైన శిక్ష సమాజం నుంచి వారిని దూరం పెట్టడమే అని….కానీ ప్రస్తుతం ఉన్న ప్రపంచం లో ఆ అసాంఘిక వ్యక్తీ ఎవరో కూడా మనకి సరిగ్గా తెలియదు….వంద కోట్లలో ఎవరంటే ఎం తెలుస్తుంది….తెలియకుండా ఎలా వాడిని దూరం పెట్టడం ? లంచగొండితనం గురించి అందరు వ్యతిరేకంగా మాట్లాడుతారు…చాల వరకు నిరాశాజనకమైన అభిప్రాయాలే ఇస్తుంటారు…..ఈ దేశాన్ని లంచగొండితనం నుంచి ఎవరు మార్చలేరు…..లంచం తీసుకున్నవాడిని భారతీయుడు సినిమా లో లాగా చంపెయడమే మార్గం…లాంటివి ఇస్తుంటారు….కాని ACB అని ఒకటుందని …..అది పని చేస్తోందని…..అది ఎవరిని పట్టుకుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే భారతదేశంలో లంచగొండితనం మీద మరీ అంత నిరాశాజనకమైన ఆలోచలనలు కాస్త తగ్గుతాయి…..ఈ రెండు పనులు డింగరి  బ్లాగు ఓనర్ చేస్తున్నారు….ఎప్పటికప్పుడు ACB ఎవరిని పట్టుకుంది….ఆ లంచగొండి ఈ శాఖ కి చెందినవాడు…ఏ వూర్లో …ఏ రోజు…ఈ వివరాలన్నీ ఇస్తున్నారు..

http://dd-dingari.blogspot.com/

ఈ రెండు బ్లాగులు మటుకు నన్ను బాగా impress చేసాయి.

Wednesday, January 26, 2011

And what's so great about being a republic?

Not many citizens get the meaning of republic. the meaning of republic. I have never understood it when I was a school kid. All I know is I have to include few more things to the Independence day speech along with the date of the day. I will have to include three words , those are ambedkar, constitution and rajendraprasad. I have to replace the “independence day” with “republic day” and agust 15th with january 26th. Everything else like gandhi, bhagatsingh , azad, nehru, their struggle for freedom , their sacrifice etc etc …these things will remain the same. That’s it, my speech is ready and I am good to go to stage. And we collect our chocolates and go home then enjoy the the rest of the day. Its like ambedkar and rajendraprasad worked very hard so that Indians can have one more public holiday.

After my school, I get to stay at home and watch the live show from New Delhi, where Indian army weapons and  diverse culture of India are paraded on decorated-trucks, after attending the colony flag hosting by our local leader who always comes late and delivers a speech no better than a school kid.
I never really understood what’s republic is all about. I suck at social studies. In the meanwhile I have seen the Gladiator movie. I loved the fighting scenes and background music, but the dialog “Rome should be republic again” made me think about it a lot.

A country could be called a republic if people get to choose by whom they will be governed. And it also means the nation no longer following monarchy. We don’t have monarchy now, so that’s why we are republic? In that case August 15th should be considered the day India become Republic. Why its January 26th?

Keeping aside the textbook definitions, republic means people having control over the govt. India has adopted the constitution on this day, which creates a framework within which govt has to work. It says
WE, THE PEOPLE OF INDIA, having solemnly resolved to
constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC
REPUBLIC and to secure to all its citizens

So we are responsible for whatever happens in India. Either good or bad. The politicians are not corrupt , WE elected those corrupt people as our legislators, and its us who didn’t bother not to re-elect those politicians. We made this country rise like a phoenix from the ashes after independence. . Its us who evade paying taxes and then shout that govt not spending money on poor ppl and police are still carrying archaic arms. And its us again who formed many NGO’s to take care of society we live in. Its us who spit and pee on the roads and roared when  an official said that “Indians have different standards of hygiene”.

In a nutshell, republic means people make the rulers. And it’s the people who are responsible for fate of the nation.

Tuesday, January 25, 2011

మహా చెత్త

నిన్న మహా టీవీ లో న్యూస్ వచ్చింది….మన ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు జగన్ ని ఒక హత్య కేసు నుంచి కాపాడారని ప్రకటించారని. …ఈ న్యూస్ మీద తర్వాత రోజు చాల హంగామా అవుతుంది అనుకున్నా…తర్వాత అర్థం అయింది ఏమిటంటే …ఇది “MAHA TV EXCLUSIVE PUKAR” అని….ముఖ్యమంత్రి గారు రచ్చబండ లో ఏమన్నారో …ఈ చెవిటి జర్నలిస్టులకు ఏమి వినిపించిందో….నిన్న సాయంత్రం అంతా మహా టీవీ లో ఈ గోలే సాగింది…

ఇలాంటి పిచ్చి వాగుడు వాగుతారనే ….SKC report తర్వాత పోలీసులు electronic media ని నోరుమూసుకోమని చెప్పింది…

electronic media కన్నా print media బెటర్ ఈ విషయం లో…వాళ్ళు కాస్త అలోచించి …వచ్చిన న్యూస్ ని ఇంకోసారి చెక్ చేసుకుని ప్రజలకి చేరుస్తారు…

Sunday, January 23, 2011

Makara jyoyhi

Recently at shabarimala 106 people died of stampede. Probably they are too eager to watch the ‘divine’ makarajyothi. Starting that day many tweets and facebook status messages were on the internet questioning benevolence of religion. Especially by Marxists and atheists.Next day media shunted kerala govt for posing only 4 police men to handle around 3 lakh devotees. Kerala high court is watching the whole case now.

The observing of makara jyothi is considered to be a sacred thing and an astronomical wonder. It supposed to drive away daemons. . Because it starts about the same time harathi is given to lord ayyappa.  I am not sure now but earlier this sacred incident used to be telecasted live in the tv. I remember it because my aunt made me to do namaskaram to the jyothi when its happening in kerala. Yes, I did a namaskaram to the TV..hehe.

But the stampede issue raised the  questioning of divinity of the jyothi again.. Now interesting stories are coming out about it. In olden days, the tribes who live on the hilltops of ponnambalmedu ( it’s the name of the hill over which makarajyothi always been sighted) used to make the fire. Now as the tribes are driven out of forest, the Travancore Devaswom Board took up the fire-making duty every year. To make things easy they even constructed a cement platform there. The encircled part in the picture  is the shabarimala temple complex. And don’t get ideas to go for a trek on ponnambalmedu hill and take pics of the platform with your mobile camera. Its restricted area now. Smile

Is it wrong to create superstations to make  religion more miraculous? . As buchibabu in “chivaraku migiledi” indicates that the cleverest of all the human deeds is the creation of god. Don brown in “Angels and demons” argues that we need miracles in the name of religion to preserve the concept of god.

Yes, many people need god. And they rely on him because he is powerful. So to keep up his image he (or someone else on his name) should show his strength to the world now and then.

But is it right to allow these things (makarajyothi, ganesha drinking milk , mother Mary shedding the tears of blood, ash from baba’s picture, lightening up of lamps in which water is used as fuel…etc etc ) so that we can have faith in god again. No, because usually  its not the fear of god which goes to our head when we see such things, its usually the conceit of religion which gets hold of brain which asks us to hate others. Probably these things might have served the purpose in the old days where each religion is confined to one region. In the era of globalization these are bad for the society. 

Tuesday, January 11, 2011

గుర్రం గుర్నాధం

మొన్న ఒక website లో నా బ్లాగు చేర్చమని mail రాస్తే…నాకు reply ఇచ్చిన వ్యక్తి నన్ను ఆర్యా అని refer చేసి ( చిన్నప్పుడు నేను రాసే leave letters గుర్తొచ్చాయి…ఆర్యా…నాకు జ్వరం వచ్చిన కారణం వల్ల తరగతికి హాజరు కాలేకపోతున్నాను…నాకు సెలవు ఇప్పిన్చవలసిన్దిగా కోరుతున్నాను…..ఇలా రాసే వాడిని )….ఆ తర్వాత అయన అంతర్జాలానికి దూరంగా ఉండటం వల్ల ఆలస్యంగా సమాధానం ఇస్తున్నా అని explanation ఇచ్చాడు…..ఈ అంతర్జాలం ఏంటి మార్జాలం లాగా అనుకున్నా….తర్వాత అర్థం అయింది అయన internet అంటున్నాడు అని….

ఇంత భయపెట్టే-తెలుగు (దాన్నే గ్రాంధికం అని కూడా అంటారు ) చదివాకా….చూపులు కలసిన శుభవేళ సినెమా లో కోట శ్రీనివాసరావు character గుర్తొచ్చింది…..నేనయితే వెంటనే youtube లో videos చూసి ఆనందించా….

Thursday, January 06, 2011

Dice వేసుకుని తేల్చుకోవచ్చనా ?

ఈ రోజే శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ బయటకి వచ్చింది….ఏదో ఉంటుంది అనుకుంటే….చెత్త options ఇచ్చి ..సమైఖ్య ఆంధ్ర ని సపోర్ట్ చేసింది . తెలంగాణా ఇవ్వాలా వొద్దా? ఒకవేళ ఇస్తే హైదరాబాద్ ని ఎం చెయ్యాలో సలహా ఇమ్మంటే….ఒక అర డdice08జను సలహాలు ఇచ్చింది….దాన్లో రాయలసీమ -తెలంగాణ ని ఒక రాష్ట్రము చేయోచ్చు అని ఒక సలహా….రాయలసీమ-తెలంగాణా ఒక రాష్ట్రము కావాలి అని ఎప్పుడు అనుకున్నాయి? మరి ఎందుకు ఆ ఆప్షన్ ?
లేకపోతే శ్రీ కృష్ణ కమిటీ వాళ్ళకి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది…..ఆరు సలహాలు ఇస్తే dice వేసుకుని ఒకటి నిర్ణయించుకోడానికి మనకి తేలికగా ఉంటుంది అనేమో ?
కానీ dice వేసుకోడానికి ఇది Ludo గేమ్ కాదు ….
జై తెలంగాణా !!

Tuesday, January 04, 2011

పాపం CBI !!!

పోయిన సంవత్సరం SC విచారణ ఎలా చెయ్యాలి అన్న విషయం మీద CBI కి క్లాసు పీకింది …సర్లే ఏదో పీకిన్దిలే అని విచారణ ముందుకు పోనిస్తూ ఉంటే …నీరా రాడియా టేప్లు బయటపడ్డాయి …ఆ కోణం లో విచారణ జరపాల్సిన పరిస్తితి వచ్చింది …

కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే ఆరుషి హత్య కేసు ఎందుకు మూసేసారు అని గోల మొదలయింది…..తర్వాత ఎప్పుడో మూసేసిన బోఫోర్స్ కేసు మళ్ళి బయటకి లాగుతున్నారు.

ఆరుషి హత్య కేసు లో ముందుగా స్థానిక పోలీసులు చాలా చెత్తలా విచారణ జరిపారు ఉన్న ఆధారాలని నాశనం చేస్తూ …ఆ కేసు కాస్తా CBI కి వచ్చింది …ఆధారాలు లేవు …కేసు క్లోజ్ చేద్దామంటే ప్రజలు కొవ్వత్తులు పట్టుకుని రోడ్ మీద నడుస్తూ తిడుతున్నారు …పోనీ అలానే వదిలేద్దమా అంటే “బ్రేకింగ్ న్యూస్ “ దొరక్కపోతే news anchors స్టూడియో లో కూర్చొని ఆరుషి ఫోటో background లో పెట్టి తిడుతున్నారు …

ఎవ్వరికి ఏ విషయం లో కోపం వచ్చినా “CBI విచారణ” అంటారు .. ప్రభుత్వం కూడా వీళ్ళకి కేసు అప్పగిస్తే వచ్చే ఎన్నికల వరకు ప్రతిపక్షము వాళ్ళు ఈ విషయం లో అరవడానికి ఏమి ఉండదు కదా అని వీళ్ళకి ఇచ్చేస్తారు .

పోనీ ఇచ్చిన ప్రతి కేసుని solve చేసుకుంటూ వెళ్దామంటే …CBI court తీర్పుని High court లో , దాని తీర్పుని supreme court లో question చేస్తూ ఇలా ప్రతి కేసు దశాబ్దాలు సాగుతూ ఉంటుంది …దీన్లో న్యాయవ్యవస్థ నెమ్మదితనం ఎంత ? CBI విచారణ జరిపిన కాలం ఎంత అని ఎవరు పెద్దగా పట్టించుకోరు .

తవ్విన కేసునే తిరిగి తవ్వి, మళ్ళి తవ్వి, మళ్ళి తవ్వి …..ఇంత తవ్వడం ఒక గునపం తీసుకుని భూమిలోకి తవ్వితే భూగోళం కి అవతల వైపు నుంచి బయటకి వచున్దేవాళ్ళు ఈ పాటికి . ఇంత తవ్వుతున్నా సరిగ్గా తవ్వడం రాదు అన్న పేరు మాత్రం మిగులుతోంది.

Monday, January 03, 2011

2010 లో చదివిన పుస్తకాలు

 

Non-fiction

Fatal conceit : errors of socialism : Friedrich Hayek రాసిన పుస్తకం. ప్రజలు అనుకరణ వల్లే కొత్త విషయాలు నేర్చుకుంటారని argue చేస్తూ , socialism మీద చర్చ సాగుతుంది ఈ పుస్తకం లో .

India after independence : బిపిన్ చంద్ర రాసిన పుస్తకం. స్వతంత్రం తర్వాత రాజకీయ పరిణామాల మీద ఉంటుంది ఈ పుస్తకం లో..

ఒక దళారీ పశ్చాత్తాపం: http://sanjutheking.blogspot.com/2010/07/blog-post.html

India’s politics, a view from the back bench: బిమల్ జలాన్ (MP) దీని రచయిత …indian democracy మీద ఎక్కువగా చర్చించారు

పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు: తాపీ ధర్మారావు గారి పుస్తకం. అయన మిగతా పుస్తకాల లాగే cultural anthropology మీద ఇది కూడా. వివిధరకాల సంప్రదాయాలలో వివాహ పద్దతులు ఎలా వచ్చాయో వివరించదినికి ప్రయత్నం జరిగింది. తోటి పెళ్లి కొడుకు , తోటి పెళ్లి కూతురు లాంటివి ఎందుకు? ఇలాంటి వాటి మీద ఎక్కవగా మాట్లాడారు .

దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకు : తాపీ ధర్మారావు గారి పుస్తకం. చాలా చిన్నది….శృంగారానికి మతానికి ఉన్న సంబంధం గురించి ఎక్కువగా ఉంటుంది.

The undercover economist : ఒక కాఫీ కంపెనీ వ్యాపారం ఎలా చేస్తోందితో మొదలుపెట్టి, కొన్ని దేశాలు ఎందుకు పేద దేశాలుగా ఉండిపోతాయో వరకు అర్థశాస్త్రం ని బాగా వివరించాడు.

Fiction

Jurassic park:  Michael Crichton రాసిన నవల.జురాసిక్ పార్క్ సినిమా తో చూస్తె చాలా బోరింగ్ అనిపించింది. 

Congo: ఇది కూడా Michael Crichton దే. సినిమా కన్నా పుస్తకం బాగుంది. gene structures మీద ఆఫ్రికా రాజకీయాల మీద, technology development మీద మంచి info ఉంది.

The picture of dorian gray : ఎప్పటినుంచో చదువుదాం అనుకున్న పుస్తకం….మొత్తానికి పోయిన సంవత్సరం చదివా…ఆస్కార్ వైల్డ్ దీని రచయిత…ఎప్పటికీ చావు లేకుండా , యవ్వనం తరగకుండా ఉండటం వరమా లేక శాపమా అన్నది plot. సమాజం మీద మంచి remarks ఉన్నాయి దీన్లో.

అతడు అదివిని జయించాడు : http://sanjutheking.blogspot.com/2010/10/blog-post.html

గాలి కొండాపురం రైల్వే గేటు : suspense-thriller ….పాకిస్తాన్ గూఢచారులు ….బాంబులు, chemistry , డైరెక్టర్ వంశి స్టైల్ కామెడీ …బాగానే ఉంది..కానీ చివర్లో pages లేకపోవడం వల్ల..హంతకుడు ఎవరో తెలుసుకోలేకపోయాను Smile

Two states: చేతన్ భగత్ స్టైల్ హాస్యం , చేతన్ భగత్ స్టైల్ ప్రేమ కధ

తులసీదళం:   చంద్రముఖి లో జ్యోతిక దెయ్యం పట్టి అలా behave చేసిందా లేక psychological problem వల్ల అలా ఉందా తేల్చకుండా వదిలేస్తాడు కదా….దీన్లోను యండమూరి అలానే చేసాడు…ఆ చిన్నపిల్లకి ఆ రోగాలన్నీ దెయ్యం వల్ల వచ్చాయా లేక hypnotism వల్ల వచ్చాయో తేల్చకుండా నవల end చేసేసాడు

Animal farm : కమ్యునిస్ట్ ఫిలోసోఫి ని కొంతమంది స్వప్రయోజనాల కోసం ఎలా వాడుకుంటారో  వ్యంగ్యంగా రాసాడు . రచయిత పేరు George Orwell

1984 : ఇది కూడా George Orwell రచనే …animal farm లో సోసిఅలిసం ఎలా ప్రారంభం అవుతుంది అన్న దాని మీద ద్రుష్టి పెడితే …దీన్లో establish అయ్యాక  govt చేసే పనులు ఎలా ఉంటాయి అన్నది వివరించడానికి ప్రయత్నిస్తాడు . “Big brother” అన్న పదం ఈ పుస్తకం లోంచే పుట్టింది

lord of the flies : కొంతమంది పిల్లలు ఒక ద్వీపం లో ఇరుక్కుపోతారు , వాళ్ళ మధ్యలో అధికారం కోసం జరిగే పోరాటం, పెద్ద వాళ్ళు ఇలా చేస్తారు అని అనుకొని పనులు చెయ్యడాలు, చిన్న పిల్లల లో ఉండే silly నమ్మకాలు, వాళ్ళ భయాలు, చాలా బాగుంది పుస్తకం . దీని రచయిత William Golding.

ప్రేమ : ఇంకో యండమూరి నవల. Anthropology టచ్ కొంత ఉంది. ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ మీద కన్నా, ఒక వ్యక్తికి ప్రపంచం మీద ఉన్న ప్రేమని వివరించడానికి కాస్త కష్టపడ్డాడు అనిపించింది.