పోయిన సంవత్సరం SC విచారణ ఎలా చెయ్యాలి అన్న విషయం మీద CBI కి క్లాసు పీకింది …సర్లే ఏదో పీకిన్దిలే అని విచారణ ముందుకు పోనిస్తూ ఉంటే …నీరా రాడియా టేప్లు బయటపడ్డాయి …ఆ కోణం లో విచారణ జరపాల్సిన పరిస్తితి వచ్చింది …
కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే ఆరుషి హత్య కేసు ఎందుకు మూసేసారు అని గోల మొదలయింది…..తర్వాత ఎప్పుడో మూసేసిన బోఫోర్స్ కేసు మళ్ళి బయటకి లాగుతున్నారు.
ఆరుషి హత్య కేసు లో ముందుగా స్థానిక పోలీసులు చాలా చెత్తలా విచారణ జరిపారు ఉన్న ఆధారాలని నాశనం చేస్తూ …ఆ కేసు కాస్తా CBI కి వచ్చింది …ఆధారాలు లేవు …కేసు క్లోజ్ చేద్దామంటే ప్రజలు కొవ్వత్తులు పట్టుకుని రోడ్ మీద నడుస్తూ తిడుతున్నారు …పోనీ అలానే వదిలేద్దమా అంటే “బ్రేకింగ్ న్యూస్ “ దొరక్కపోతే news anchors స్టూడియో లో కూర్చొని ఆరుషి ఫోటో background లో పెట్టి తిడుతున్నారు …
ఎవ్వరికి ఏ విషయం లో కోపం వచ్చినా “CBI విచారణ” అంటారు .. ప్రభుత్వం కూడా వీళ్ళకి కేసు అప్పగిస్తే వచ్చే ఎన్నికల వరకు ప్రతిపక్షము వాళ్ళు ఈ విషయం లో అరవడానికి ఏమి ఉండదు కదా అని వీళ్ళకి ఇచ్చేస్తారు .
పోనీ ఇచ్చిన ప్రతి కేసుని solve చేసుకుంటూ వెళ్దామంటే …CBI court తీర్పుని High court లో , దాని తీర్పుని supreme court లో question చేస్తూ ఇలా ప్రతి కేసు దశాబ్దాలు సాగుతూ ఉంటుంది …దీన్లో న్యాయవ్యవస్థ నెమ్మదితనం ఎంత ? CBI విచారణ జరిపిన కాలం ఎంత అని ఎవరు పెద్దగా పట్టించుకోరు .
తవ్విన కేసునే తిరిగి తవ్వి, మళ్ళి తవ్వి, మళ్ళి తవ్వి …..ఇంత తవ్వడం ఒక గునపం తీసుకుని భూమిలోకి తవ్వితే భూగోళం కి అవతల వైపు నుంచి బయటకి వచున్దేవాళ్ళు ఈ పాటికి . ఇంత తవ్వుతున్నా సరిగ్గా తవ్వడం రాదు అన్న పేరు మాత్రం మిగులుతోంది.
No comments:
Post a Comment