పాత విలన్ అనగానే , రంగురంగుల లైట్లు వెలుగుతున్న ఒక Den with sliding doors ఓనర్ , స్మర్గ్లింగ్ , గట్టిగా నవ్వడం, హీరో చేతికి దొరకగానే వెంటనే చంపకుండా పెద్ద పెద్ద డైలాగులు ఇస్తూ ఉండటం, ఇలాంటి విల్లన్ కాదు.
అసలు ముసలితనం , చావు ని తప్పించుకోవాలని చూడటం, ప్రపంచాన్ని జయించాలి అనుకోడం , ఒక నిది సంపాదించాలి అనుకోడం , ఇలాంటి విల్లన్ అన్నమాట . అంటే ఒక Dorian Gray, ఒక పాతాళభైరవి మాంత్రికుడు , అంజి లో విలన్ , వాలి, భస్మాసురుడు ....ఓహ్ ఈ లిస్టు చాలా పెద్దది లెండి, అప్పట్లో అసలు చావుని తప్పించాలనుకోడం చాలా తప్పు అన్నట్టు చూపించేవారు.
ముసలితనం, దాని తర్వాత చావు ప్రతి జీవికి ఉండేవే కదా...చుట్టూ ఇంతమంది రోజు ముసలివరవడం, చావడం చూస్తున్నాం కాదా , కాబట్టి చావు వొద్దు అనుకోడం మూర్ఖత్వం , అమాయకత్వం ...అంటూ చెప్పే పెద్దమనుష్యులంతా, ముసలితనం దాచుకోడానికి జుట్టుకి రంగులు వేసి, ponds age miracle లాంటివి వాడుతూ , తొందరగా బకెట్ తన్నకుండా ఉండడం కోసం ఆరోగ్యంగా ఉండటం కోసం మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండే రకాలు, అసలు వాళ్ల మాటలని పట్టించుకోక్కర్లె .
ఇక నిమిషానికి పదిసార్లు ' ఈ పని చెయ్యలేక చస్తున్నా , ఆ పని చేయలేక చస్తున్నా ' అనే వాళ్ళని, ఏదో facebook app లోనో , ఒక చెత్త వెబ్సైటు లోనో వాళ్ళు ఫలానా రోజు చస్తారు అని ఒక తేది చూసుకుని, అందరికి చూపించి , ఇంకా అంతకాలం బ్రతకాలా నేను అనే వాళ్ళు ( ఇలాంటి వాళ్లకి వెంటనే ఒక కత్తి ఇచ్చి ....go ahed అని చెప్పాలని ఉంటుంది నాకు ) ...ఇలాంటి నిరాశావాదులని కూడా లైట్ తీసుకోవచ్చు .
చావుని చూసి భయపడటం అనేది ఇప్పటిది కాదు కదా ...యక్ష ప్రశ్నలలో ఒక ప్రశ్నకి సమాధానంగా ధర్మరాజు, రోజు చాలా మంది చావడం చూస్తున్న, మనుష్యులు చావుని accept చేయకపోడమే పెద్ద వింత అంటాడు . సాహిత్యం లో కూడా మరణం గురించి మంచి ప్రస్తావనే ఉంటుంది . కాని ఎందుకు మరణాన్ని ఆమోదిన్చాలేకపోతున్నాం?
ఇక్కడ సమస్య, ముసలితనం వచ్చాక ముడతలు , మరణం తర్వాత స్వర్గమా నరకమా అని కాదు, ఇక్కడ సమస్య జీవితం అందంగా ఉండటం. ఏది ఏమయినా చివరకి ఆనందం ఉంటుంది అనే నమ్మకం ఉండటం, అసలు చుట్టూ ఉన్న ప్రపంచం ని పూర్తిగా తెలుసుకోడానికే చాలా సమయం పట్టడం, ఈ ఆనందం ఎప్పటికీ ఉండాలి అనుకోడం ...అది సమస్య.
ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం, కాలానికి ముసలితనానికి ఉన్న సంబంధాన్ని చేరిపివేయడం. అనగా గడుస్తున్న సంవత్సరాలకి, వయస్సుకి ఉన్న సంబంధం. వయస్సుని తమ ఆధీనం లోకి తెచ్చుకోవాలి అనుకున్నవారు "fountain of youth" వెనకాల పడ్డారు , సమయాన్ని ఆధీనం లోకి తెచ్చుకుని ఒకవేళ ముసలితనం వచ్చేసినా గతం లోకి ప్రయాణం చేసి , అలా ఎప్పటికి యవ్వనం లో ఉండిపోడం అనుకునేవారు ,, టైం మెషిన్ అన్నారు. మొదటి పరిష్కారం mythology లో బాగా కనిపిస్తుంది, రెండవిది sci-fiction లో పేరు తెచ్చుకుంది.
ఇలా అనుకునే వారి పాయింట్ ఏంటంటే "The world is a fine place and worth fighting for and I hate very much to leave it."
జీవితం లో ఎన్ని దెబ్బలు తగిలినా...అది ఇంకా అందంగానే , hopeful గానే ఉంటె, అదీ సమస్య. ఇప్పుడు ఇదంతా ఎందుకు రాశాను అంటే , మొన్ననే నా పుట్టిన రోజు అయ్యింది... చెప్పగా సంవత్సరాలకి , వయస్సుకి సంబంధం లేకుండా ఉంటె బాగుండేది అని, అది నా బాధ.
ఇదే విషయం మీద రెండేళ్ళ క్రితం నా బ్లాగు లోనే గోల్లుమన్నాను ... ఆ గోల ఇక్కడ ఉంది
7 comments:
హహ్హహ్హా.. భలే ఉన్నాయండీ మీ ఆలోచనలు..
:))))
Belated happy birthday పాత విలన్ గారూ! :))
భలేగా చెప్పారండీ.. మీ ఆలోచన బాగుంది..
హ హ... దీన్నిభట్టి మనం అర్థం చేసుకోదగ్గది ఏమిటంటే, జనాలు భయపడేది చావడానికి కాదు, ముసలి తనానికి అని. కాబట్టి, నిత్య యవ్వనములో ఉండడానికి సరైన మందు ఏదన్నా జెనెటిక్ ఇంజినీరులు కనిపెడితే బావుండు. ఎంచక్కా, యవ్వనములో అలా చిరకాలం బతికేయొచ్చు. :-)
Belated happy birth day సంజీవ్ (కేవలం బ్లాగుల్లో పరిచయమే అయినా, పరిచయస్తులే కదా అని ఏకవచనం తోణే సంభోదిస్తున్నా :-)
:-))పుట్టినరోజు వైరాగ్యం....!!
@మధురవాణి .... thanyou :)
@raj...thanks raj
@srikanth .. no probs srikanth and thanks for the wishes :D]
@subhashini...hehe
నిజమే. జనాలసలు ఇప్పుడేమో తీరిగ్గా సంపాదనలో గడిపి. ఇక చాలు అనుకున్నాక సంపాదించింది అనుభవించడంలో పడతారు. సాధారణంగా ఈవయసు మధ్యవయసు తరువాతదయ్యుంటుంది. మరప్పటికి వయసూ,ఓపికలెలాగూ వుండవు సమయంకూడా వుండబోదా అన్నదే ఈ "చావు"బాధ.
He is not a doctor.He dont have any scienfic knowledge.Following his diet may give bitter results. some of his tips are too dangerus.
1.abandoning salt may lead to hyponetremia.
2.Drinking 5 liters of wa terleads to water dopits in brain.water toxicity.
3.Leaving non veg leads to vitamin b12 deficiency.
4.Raw vegetables had pesticides which leads slow poisioning.
5.Spourts relese toxins when they are growing.
This list goes on if research is done.
Lastly too much of anything is against to nature.
And ignorence is bliss
Post a Comment