To : smt.parvati@kailasam.org
From : hussain_sagar@hyderabad.in
CC : flutekrishna@heaven.in
Sub: మీ శాపాన్ని వెనక్కి తీసుకోవలసిందిగా మనవి.
గౌరవనీయులయిన పార్వతి దేవి గారికి ,
ముందుగా మీకు మీ కుటుంబానికి వినాయకచవితి శుభాకాంక్షలు.
నేను హైదరాబాదు వాస్తవ్యుడని. మీ శాపబాధితుడిని. మీరు నాకేమి శాపం విధించలేదు కాని, కాస్త మీరు నా గోడు విని నాకో మార్గం చూపించావలసిన్డిగా మనవి.
నా కష్టాలకి మూల కారణం , మీ పెద్దబ్బాయి గారికి , తల్లిదండ్రుల మీద ఉన్న భక్తీ తో మొదలయింది. తమ్ముడి మీద గెలిచిన ఆనందం ఎంత ఉంటె మటుకు మరీ అన్ని ఉండ్రాళ్ళు తింటారా చెప్పండి? పోనీ తిన్నాడు , అంత తిన్నాకా అరగడానికి ఒక కిళ్ళి వేసుకుని ఒక గోలి సోడా తాగి పడుకోకుండా, మీకు దండం పెట్టడానికి వచ్చాడు , పోనీ భుక్తాయాసం లో తల్లి దండ్రుల మీద భక్తీ ఎక్కువయ్యి ఉంటుంది అనుకుందాం, ఒక నమస్కారం పెట్టి , పొగుడుతూ పద్యం పాడకుండా , సాష్టాంగ నమస్కారం చేయడం అవసరమా ? ఎన్నో చేసాం, ఇది చెయ్యలేమా అని అనుకుని ప్రయత్నించి ఉంటాడు అనుకుందాం, కాళ్ళు చేతులు భూమికి ఒకేసారి భూమికి ఆన్చలేక , పార్కు లో see-saw లాగ ఊగుతున్నప్పుడన్నా ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలి కదా , నేను విఘ్నాలకి అధిపతిని , దీనికే ప్రయత్నం విరమిస్తే ఎలా అని ప్రయత్నిస్తూనే ఉండి ఉంటాడు , పోనీ మీరన్నా అయన కష్టం గ్రహించి , పోన్లే నాయనా , అరిగాక రేపు వచ్చి దండం పెడుడువులే, అని దీవించి పంపొచ్చు కదా , అలా చూస్తూ కూర్చున్నారు, వూగి వూగి ఆయన పొట్ట పగిలిపోతే , చంద్రుడు నవ్వడం వల్లే అనుకున్నారు , పోనీ కొడుకు పడుతున్న బాధలు చూసి ఆ సమయం లో అలా అనుకున్నారు అనుకోవచ్చు, అలా అనుకుంటే, పెడితే గిడితే శాపం చంద్రుడికి పెట్టాలి కాని, చంద్రుడ్ని చూసే వారికి ఎందుకు ?
మానవులు అంటే, ఏమి శక్తులు లేని వాళ్ళు కాబట్టి, ఏమి చెయ్యలేరు అని మీ ఫీలింగ్, కాని మానవుల దగ్గర, ప్లాస్టిక్ బాగులు ఇంకా బోలెడు చెత్తా ఉన్నాయి , అవి అన్ని నాలో వేసేసి, నన్ను కంపు గొట్టేలా చేసి, తర్వాతా మీ కుమార రత్నం విగ్రహాలు వేసి కసి తీర్చుకుంటున్నారు. మీ శాపాలు, వాళ్ల కోపాల మధ్యలో నాలో కాలుష్యం ఎంత పెరిగింది అంటే, హాలాహలం ని తట్టుకున్న మీ ఆయనకీ కూడా , నా లోని నీరు తాగితే అనారోగ్యం వస్తుంది, నా దగ్గరకి వచ్చి వాసన పీలిస్తే, మీ పెద్దబ్బాయి కి ఉన్న తొండం అనబడే పెద్ద ముక్కు దెబ్బతింటుంది, మీ చిన్నాబ్బాయి గారికున్న నెమలి ఈకలు ఊడి పోతాయి , అంత కాలుష్యం ఉంది నాలో.
మానవులు మంచి కోపంగా ఉన్నారు మీ అబ్బాయి మీద, ఎవ్వరు చెప్పినా వినడం లేదు. నాలో వేసి ఆయనని అవమానించకండి అని ఆఖరికి హై కోర్టు చెప్పినా వినడం లేదు, కాస్త దూరంగా నాగార్జునా సాగర్ లో వెయ్యొచ్చు కాని, అక్కడి దాకా వెళ్ళే ఖర్చులతో ఇంకాస్త మందు తాగోచ్చని వాళ్ళ ఆలోచన.
నాయందు దయతో అయినా లేక మీ అబ్బాయికి జరుగుతున్నా అగౌరవం వల్ల అయినా , మీరు పెట్టిన శాపాన్ని వెనక్కి తీసుకోవలసిందిగా కోరుతున్నాను. మీరు శాపం పెట్టేసి, ఇంతకాలం పట్టించుకోకపోతే , క్రుష్ణులవారే మానవులకి శమంతకమణి కథ remedy సూచించారు, ఒక వేళ మీరు ఈ మెయిల పట్టించుకోకపోయినా కనీ, సం వారయినా, నీలాపనిందలు కలగకుండా ఉండాలంటే కథ చదవడం తో పాటు హుస్సేన్ సాగర్ లోని నీళ్ళు ఒక గ్లాసుడు తాగాలి అని సెలవిస్తే నాలోని కాలుష్యం కొంచం తగ్గే అవకాశం ఉంది , అందుకే ఆయన్ని లూప్ లో పెట్టి ఈ మెయిలు పంపుతున్నాను.
Regards,
H. Sagar

18 comments:
కొత్తగా బావుంది :)
చాలా బాగుంది ..:)
బాబోయ్ హుస్సేన్ సాగర్ ని చూసిన వాళ్లకి ....@@"£$"£$"£%?£$
అని ఇంకో శాపం ఇప్పి౦చే లా ఉన్నారే :)
@చంద్రుడ్ని చూసే వారికి ఎందుకు ?
చంద్రుడ్ని అంటరాని(క౦టరాని) వాడు అన్నట్లు :)
Good & very satirical boss:)
డేర్2క్వెశ్చన్ సారూ... ఫోటోలో బాగా తెల్ల బడినట్టున్నారు, పోల్చుకోలేక పోయాను. ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమా? ఫోటోషాపా? మీ సౌందర్య రహస్యం చెప్పరాదే... నేనూ కొంచెం నలుపే, కాస్త తెల్ల బడుదామని, గంతనే.
సీరియస్గా...
సంజు రాజా, కొంచెం తీవ్రంగా ఆలోచించా... దీనికి పరిష్కారం ఆ సరస్సుకు 'రాజీవ్/సోనియా మానస్ సరోవర్' అని పేరు పెట్టి, అందులో శుచిగా 3మునకలు వేసి వచ్చిన వారికే కాంగ్రెస్-తీర్థం ఇవ్వబడుతుందని 'చిరు'పార్టీలకు ఓ సందేశం/హెచ్చరిక పంపిస్తే ఎలావుంటుందో ఓ సారి పరిశీలించండి.
చాలా బావుంది. సరదాగా ఉన్నా పర్యావరణ కాలుష్యం గురించి ఆలోచింపజేసేలా ఉంది. కానీ హుస్సేన్ సాగర్ నీల్లని తాగడమా..? బాబోయ్..!!
కేక.. క్రొత్తగా, గమ్మత్తుగా చెప్పారు.
@nagarjuna .. thankyou ..welcome to my blog
@kiran .. thankyou
@mauli ... chooste akkarledu...chetta veste shapam tagilte chaalu
@R.s.Reddy .. thankyou :)
@snkr....hehe
@srikanth ...... :D
@raj.. thankyou raj garu
నా బ్లాగు......నా పిచ్చ్హి గోల.. అంటే ఎంటోలే
ఈ పిచ్చిగోల అనుకున్నా, కాని ఇంత మంచి గోల ఉందని ఇప్పుడు కదా తెలిసింది.
సంజు గారూ.. జ్యోతిర్మయి గారన్నట్లు, ఏదో పిచ్చి గోలే అనుకున్నా.. చాలా మంచి గోలని తెలిసింది:) టపా చాలా బాగుంది కొత్తగా.. హాస్యభరితంగానైనా మంచి విషయాన్ని ఫోకస్ చేశారు..
@జ్యోతిర్మయి ... dont judge a book based on its cover and dont judge a blog based on its title :D, welcome to my blog
@మనసు పలికే ... thankyou :)
నిజమే నవ్విస్తునే చేస్తున్న తప్పులను చెళ్ళుమనిపించేలా చెప్పారు :)
:) :) :) :)
మీ ఉత్తరం తెగ నచ్చింది నాకు.సునిశితమైన హాస్యం! ఇంకా చాలా మంచి సందేశం! చప్పట్లు..
@నేస్తం & కృష్ణప్రియ .. thankyou :)
@kathi mahesh kumar.... welcome to my blog
baga raasaw sanjeev..:)
Post a Comment