ఇండియా గెలవడం కష్టం.
ఈ వ్యవస్థ కుళ్ళిపోయింది
ఈ దేశం ఇక బాగుపడదు
we don’t deserve democracy , dictatorship is right for us.
ఇండియన్స్ కి అంత సీన్ ఉందా?
ఇలాంటి నిరాశ పరిచే statements బోలెడు చెబుతారు నిరాశావాదులు
కొంతమంది ఉంటారు ….వీరికి రాజకీయాలు పెద్దగా తెలియవు…పాటల ప్రోగ్రామ్స్ మధ్యలో చానల్స్ మారుస్తూ మారుస్తూ ఏదో ఒక సెకండు న్యూస్ చూస్తారు, లేదా పేపర్ లో స్పోర్ట్స్ పేజి కి వెళ్తూ వెళ్తూ పొరపాటున మెయిన్ పేజి లో ఏదో స్కాం అనో, లేక లంచం అనో ఏవో అలంటి పదాలు చూస్తారు, సాయంత్రం స్నేహితలుతో మాత్రం ఈ దేశం పాడయిపోయింది మామా …ప్రత్రీ రాజకీయనాయకుడు ఒక దొంగే ….ఇలాంటి కబుర్లు వస్తాయన్నమాట …వీళ్లో రకం..
ఇక RSS వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రతి సమస్య కి పరిష్కార మార్గం హిందువులంతా ఒకటయ్యి ముస్లిమ్స్ ని , క్రిస్త్రియన్స్ ని ఇండియా లోంచి తరిమేయ్యడం …ఏ సమస్య అయినాసరే క్రిస్టియన్ మిషనరీస్ వల్లనే వస్తోంది…హిందూ మతం ని నాశనం చేయడానికి వాటికన్ సిటీ డబ్బులు పంపిస్తోంది….మన ఖర్మ కాలి, వాటికని సిటీ ఇటలీ లో ఉండటం, రాజీవ్ గాంధీకి ఒక ఇటలీ అమ్మాయి నచ్చడం…తర్వాత కాంగ్రెస్ వాళ్ళు సోనియాగాంధి నాయకత్వం కోరడం…..దీనికి పై పెచ్చు మన పాత ముఖ్యమంత్రి YSR ఒక క్రిస్టియన్ కావడం ….అసలు కేంద్రం లోను రాష్ట్రము లోను క్రిస్టియన్ పాలన నడుస్తోంది అన్న వాదన విని విని చెవులు వాచిపోయాయి.
ఇంకో వర్గం ఉంది….వీళ్ళు కూడా దేశం నాశనం అయిపోతుందనే నమ్ముతారు….నాశనం అయిపోడానికి కారణం మటుకు మన సంస్కృతీ సంప్రదాయాలని మనం మర్చిపోవడం కారణంగా చెప్తారు…..కులాంతర వివాహాలు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయడం , పిల్లలు పరాయి దేశాలలో చదువుకుని అక్కడి పడమటి సంస్కృతిని ఇక్కడకి తీసుకువస్తున్నారని, ఈ మదర్స్ డే , లవర్స్ డే లాంటివి జరుపుకుంటూ , ప్రేమ పేరుతో వెధవ వేషాలు వేస్తూ, తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వకుండా కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటూ హిందూ సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని …మన దేశం నాశనం అయిపోడానికి గల కారణాలలో సినిమాలు కూడా ఉన్నాయి అని వీరు గట్టిగా నమ్ముతారు.ఇప్పుడు వస్తున్నా సినిమాలలో బట్టలు విప్పి చూపడం తప్ప ఏముంది చెప్పు అంటూ !! ( వీళ్ళు మాత్రం జయ మాలిని, జయ చిత్ర డాన్సులు చూసిన్వల్లె, రాజ్‌కపూర్ మూవీస్ ని తెగ మెచ్చుకున్న వాళ్ళే …జయమాలిని వాళ్ళతో పోలిస్తే ఇప్పటి ఐటెంసాంగ్ లో డాన్స్ చాలా బాగుంటుంది. వాళ్ళ లాగా వెకిలి డాన్సులు కావు ) ఇంట్లో పొద్దున్న లేచినదగ్గర నుంచి భక్తీ టీవీ పెట్టేసి, తర్వాత మంతెన సత్యనారాయణ రాజు ప్రోగ్రాం ఫాలో అవుతారు usual గా ఈ గ్యాంగ్ అంతా ..
తొందరగాళ్ళు ……వీళ్ళకి అన్నిటికి తొందరేక్కువే ..అసలు మన దేశం ఎందుకు తొందరగా డెవలప్ అవ్వడం లేదు అని వీళ్ళ బాధ, ..ఎమన్నా అంటే …నేను చిన్నప్పుడు చదువుకున్నాను భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని …ఇప్పటికి అదే అంటున్నారు ….