Monday, October 31, 2011

గెలిచినోడికేం తెలుసు ....

పోరాడి గెలిచిన వాడికేం తెలుస్తుంది. పోరాటం అయిపోయాక బహుమతులు, సన్మానాలు , పొగడ్తలు, కొత్త స్నేహాలు, పేరు , కొత్తగా వచ్చే మర్యాద , పెద్దల ఆశీస్సులు , చిరునవ్వులు , మందహాసాలు , గెలవడానికి ఎంత కష్టపడ్డాడో కధలుగా చెబుతూ ఉంటె పైకి కిందకి ఆడించే తలకాయలు , సలహాలు సంప్రదింపుల కోసం వచ్చే ప్రజలు , పండగ చేసుకోడాలూ , వాడి మీద వాడికి నమ్మకం ఉంది కాబట్టి అంత రిస్క్ తీసుకున్నాడు అనే ప్రశంసలు , "ఆ గెలిచాడు చూడు వాడిలా " అని పిల్లలకి ఒక రోల్ మోడల్ అవ్వడం , పార్టీ ఎప్పుడు మామా అనే పలకరింపులు , నీకేంట్రా సక్సెస్ కొట్టావు అనే మాటలు, ....

అదే ఓడిన వాడికి అయితే , పోన్లే మామ ఇంకోసారి చూసుకోవచ్చు బాధపడకు అనే జాలి మాటలు , తర్వాత ఎం చేద్దామనే ప్రశ్నలు , అదిగో వాడిలా అవి ఇవి అంటూ సమయం వృధా చెయ్యకు అని మిగత వాళ్ళకి ఒక ఉదాహరణ అవ్వడాలు , కోరిక ఉండగానే సరి పోదు కదా , తెలివి తేటలు కూడా ఉండాలి కదా అనే వెనక మాటలు , నీకు ఇంక రాదేమోరా ఓడిలేయ్య కూడదా అంటూ  డయలాగులు , ఏమయింది ఏమయింది అంటూ అత్యుత్సహపు ప్రశ్నలు , ఎందుకు పోయిన్దంటావు అంటూ ఎంక్వయిరీలు. వీటన్నింటికి సమాంతరంగా ఉండే  ఓడిపోయామన్న బాధ , తన మీద తనకున్న నమ్మకానికి పడిన దెబ్బ ,గెలిచిన వాడు నాకన్నా బెట్టర్ అని ఒప్పుకోడానికి అడ్డొచ్చే ego ,  గెలిచిన వాడి మీద మంట , ప్రజలని దూరం పెట్టాలి అనుకోడం , అలా ఎలా ఓడిపోయాం అని వెంటాడే ప్రశ్న ,  తర్వాత ఎం చెయ్యాలో అర్థం కాకపోవడం , ప్రజలు ఓటమి గురించి మాటల్డటం మానేస్తే బాగుండు అనుకోడం  , ' గెలుపు ఓటమి సమానంగా చూడాలి ' అనే ముష్టి  డయలాగులు కొట్టడం , వెధవ నవ్వులు నవ్వడం, నాలా ఎంత మంది ఓడిపోయారు అని వెతుక్కోడం ,  ఓటమి లోంచి బయటపడటానికి, ' జీవితం , ప్రపంచం చాలా పెద్దవి ' అన్న జ్ఞానోదయం తెచ్చుకోడం.

గెలిచిన వాడికేం తెలుసు, వాడి చుట్టూ తిరిగే ప్రజలకేం తెలుసు ఓడినోడి బాధ . గెలిచిన వాడికన్న,  ఓడిన తర్వాత ఇన్ని బాధలు తట్టుకుని మాములుగా ఉండే ఓడినవాడే గొప్ప .  అవును ...నేనే గొప్ప :D

Sunday, October 30, 2011

The Curious case of Narendra Modi

He should be getting " Controversial India of the Decade" award, if there is a such thing. Many could not come to a conclusion about him. Is he a hero, a villain, slayer of muslims, avenger of Hindus, visionary, growth oriented person, the best CM, the hypocrite etc etc etc and it seems he deserves not just one title but many. 

As Thomas Hobbs explained in his book Leviathan, in the absence of external fearsome power, there will be a war of all against all. And that external fearsome power in the society is police. Though there are crimes going on everyday, we cant neglect the role of police in creating fear in people so that they will think twice before indulging into a crime. But what if  the authority of police to punish when the crime is about to happen/happening is stripped? There will be a battalion just watching if someone beats you up. Now imagine, someone is coming to kill you with a weapon and police were just standing there like a statue. Somebody stole your car and police wont take a complaint, somebody occupied your land and police are motionless. 

Of course  according to some people, he did a good thing by allowing the angry mob to take revenge. If revenge is the justification of the act, then what is the point of having courts, judges, lawyers and PILs ( చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు అని పాత తెలుగు మూవీస్ లో తెగ చెప్పేవారు గుర్తుందా )

Coming to other side of coin i.e development in Gujarat. Yes, the the state is business friendly even before Narendra Modi and we just cant ignore his efforts to attract investment into the state. We will have to agree that the Gujarat under the control of Narendra Modi become the leader in business. 

But whats the point of growth in GDP, when a section of society are denied protection from violence and justice. What is the point of me having a good job with nice pay, when i am not sure police would come to protect me when i am being mugged coming home? Or at least take a complaint after that? And this treatment is only because my religion is different from CM's. 

Any way, does it matter, even if rest of India says he is a bad man.No. The people of Gujarat re-elected him with thumping majority, we should respect their verdict. Can we call them religious fundamentalists because they have elected a man who acted like one? Again no. After all we are living in a country, where a party was elected with highest majority just after its members strategically killed around three thousand sikhs, only because they belong to same religion that of the murderers of the party president.  


Friday, October 21, 2011

Telugu script in Android


Finally today i get to know how to make Android render telugu font. Its a bit complicated if you are not a geek. Just download Droidsansfallback from here. Then copy the font file to /system/fonts folder of the phone. Restart the phone. Thats it. The telugu font should be rendered in the browser and in gmail. Its actually fun to read telugu mails in mobile.

The condition is, the phone has to be rooted. If the phone is rooted, then you can copy the font using the font installer app from android. Or you could use ADB to do all the stuff. 

If you dont know what's rooting means...then go through this link once http://lifehacker.com/5339901/get-root-access-in-android-with-one-click 

 Thats not all, there is maltiling keyboard in Market which will enable us to type telugu in mobile. But its like the old Telugu Typewriter, too hard to manage, if it is any easier i would be tweeting in telugu by now.

Thursday, October 20, 2011

పులులతో పోటి పడుతున్న ఏనుగు కథ

అనగనగా ఒక దట్టమైన అడివిలో ఒక ఏనుగు ఉంది . ఒకప్పుడు ఆ ఏనుగే ఆ అడివికి పెద్ద. ఆ ఏనుగు మీద చాలా కథలున్నాయి. అడివిలో ఎవరికీ సహాయం కావాల్సి వచ్చినా ఏనుగు దిక్కే చూసే వారు . ఎక్కడ చూసినా  ఏనుగు గురించి గొప్పగా మాట్లాడుకునే వారు. కొంతకాలానికి ఏనుగుకి ఆ గొప్పదనం అలవాటు అయ్యిపోయింది. ఇంకోళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ , తత్వం మాట్లుడుతూ  కాలం వెళ్ళబుచ్చుతోంది.

. ఏనుగు గొప్పదనం విన్న ఒక  సింహం దాడి చేసి ఏనుగుని ఓడించింది. కొంతకాలానికి సింహం ఆ అడవి వొదిలిపెట్టి వెళ్ళిపోయింది. సింహం చేతిలో ఓడిపోయాక కూడా , ఏమి జరగనట్టు , తన పాత గొప్పదనాల గురించి మిగతా జంతువులులకి చెబుతూ , తత్వం మాట్లాడేస్తూ కూర్చోనేది. ఇంకోల్లతో ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఏమి పెట్టుకోకుండా , ఎక్కడికి వెళ్ళకుండా , తన దగ్గరకి ఎవరోస్తే వాళ్ళకి తన పాత గొప్పలు చెబుతూ ఇంకా అడివికి దిక్కు తనే అన్నట్టు ఉండసాగింది. గతం గురించి తప్ప వర్తమానం లో తన గురించి తాను పట్టించుకోక పోవడం వల్ల, ఏనుగు మీద మట్టి , దుమ్ము బాగా పేరుకు పోయాయి. కొవ్వు కూడా పెరగసాగింది. అలా ఏనుగు ఆకారం కొంచం గా పెద్దది అయినట్టుగా అనిపించసాగింది అందరికి . దానికి ఏనుగు పెరుగుదల రేటు అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నాయి మిగతా జంతువులు.

ఇంతలో నాలుగు పులుల ప్రభావం అడివి మీద పెరగడం మొదలయ్యింది. అన్ని జంతువులు ఆ పులుల దగ్గరికే వెళ్లడం , వాటి తోనే మాట్లాడటం ఎక్కువయిపోయింది. అడివిలో ఏనుగు ప్రభావం తగ్గిపోతోంది.  అంత పెద్ద ఆకారంతో ఉంది కాబట్టి ఏనుగు ప్రభావం  కాస్తో కూస్తో ఉంటోంది. మిగతా జంతువులు ఏనుగు దగ్గరికి రావడం తగ్గించేసాయి. ఏనుగుకి పరిస్తితి అర్థం కావడం లేదు. గతం లో తన గొప్పదనం చూసి కూడా ఎవరు తన దగ్గరికి ఎందుకు రావట్లేదో అర్థం చేసుకోలేకపోతోంది. 

ఏనుగు ఆరోగ్యం బాగా పాడయిపోయింది. ఇక తనువు చాలిస్తుందేమో అని మిగతా అందరు అనుకుంటూ ఉండగా,  ఒక డాక్టర్ వచ్చి ఏనుగుకి సలహా ఇచ్చాడు. లేచి అందరితో కలవాలని, మిగతా జంతువులతో ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు తనకే మేలు చేస్తాయని, లేకపోతే తన్నడానికి ఒక పెద్ద బకెట్ తెప్పించుకోమని. ఏనుగుకి భయం మొదలయ్యింది, గతం గురించి గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన వర్తమానం లో తను గొప్పది కాలేదని గ్రహించింది. డాక్టర్ సలహా పాటించడం మొదలెట్టింది. ముందుగా నది దగ్గరికి వెళ్లి తొండం నిండా నీళ్ళు తీసుకుని ఒంటి మీద ఉన్న కుళ్ళు వదిలిన్చుకోడం మొదలెట్టింది. ఇంకోళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం తగ్గించి, అందరిలో ఒకడిలా ఉండటం మొదలెట్టింది. మిగతా జంతువులతో సంబంధాలు మెరుగయ్యాయి., కొవ్వు తగ్గి కండ పెరగసాగింది., ఏనుగు నడక వేగం  పెరిగింది. అడివిలో అన్ని జంతువులు నోళ్ళు తెరిచి చూస్తున్నాయి దూసుకెళ్తున్న ఏనుగుని .


అంతే , అది స్టొరీ , ఇదేమి పంచతంత్రం కథ కాదు , ఇక్కడ ఏనుగు మన దేశం, సింహం బ్రిటన్ , నాలుగు పులులు ఆసియన్ టైగర్స్ , డాక్టర్ మన మన్మోహన్ సింగ్ , ఏనుగు వంటి మీది కుళ్ళు లైసెన్స్ రాజ్, ఏనుగు పెరుగుదల రేటు ఏమో Hindu rate of grwoth.   ఇది  శశి తరూర్ గారి "Panchatantra 2007: The Elephant who became a tiger" వ్యాసం ఆధారంగా రాసాను. అయన వ్యాసం లో , ఏనుగు వంటి మీద పులి చారలు వచ్చాయి అని ముగిస్తారు, మనకి తెలుగులో పులిని చూసి వాత పెట్టుకున్న నక్క సామెత వల్ల , పులితో పోటి పడుతున్న ఏనుగు అని ముగించా. అసలు వ్యాసం " The elephant, the tiger and the cellphone" అనే పుస్తకం లో మొదటి వ్యాసం, ఇది చదివాకా నేనా పుస్తకం కొన్నాను. ఈ వ్యసం మీద వచ్చే comments అన్ని అసలు వ్యాసకర్త కే అంకితం. కాకపోతే ఆయన ట్విట్టర్ లో బిజీ బిజీ ...

ఆ వ్యాసం కూడా 2007 లో రాసింది...ఇప్పుడు అయితే "డ్రాగన్ తో పోటి పడుతున్న ఏనుగు కథ " అనో "  డ్రాగన్ ని చిరాకు పరుస్తున్న ఏనుగు కథ " అనో రాయాలి నిజానికి . 

Monday, October 17, 2011

On Right to recall

Holding the right to recall to keep our elected leaders on toes seems to be a nice idea which might improvise our democracy. But we should not forget practical and theoretical problems with it.

Practical Problems

1. To recall a person, we need to have elections periodically every six months or so. And the election burden will be a problem.

2. Lets say, money is no issue and EC is conducting elections periodically so that we can recall our previously elected MP. And lets say we recalled the present fellow who is from a party and elected a guy from another party. So this is going to change the share of each party periodically in the parliament. So no party will have the guarantee to hold majority seats in parliament for 5 years, so each govt is highly unstable and our news papers will be filled with ally-formations and we will have hard time to remember who is holding a particular ministry at that time. As each govt comes with its own agenda , we will not move in a particular direction for more than six months or so.  If you been following the politics of karnataka, just imagine the same scenario at the center, then you will get the picture.

Theoretical problem is , though we call our MP's representatives, they are primarily our leaders who we trusted with our votes and next 5 years of time. Voting means , giving somebody the authority to make laws behalf of me. The one elected is the one who is trusted by many. And he will participate in law making and we should obey those laws,  that is the deal with representative democracy. But its not a lifetime opportunity.  If we are not satisfied with the way he made laws we will have the chance to recall and elect another one for every five years. So we are giving 5 years of chance for an elected govt to prove its worth and show some results, because thats the least time any govt would take to make a policy and implement it and the results to be visible.  Those representatives are not delegates to recall whenever we feel like, just like the diplomats to other nations. The delegate is the one who acts like a branch office or a messenger  or to do a particular task. Delegates dont have authority.

We just cant recall a person only because he voted for construction of dam in my locality which will swallow my farmland. But the construction of dam might provide water to lacs of hectors of land in some other village. Should my MP be punished because he helped my fellow Indians in next district or village? Of course he should be punished if he cant get me a proper compensation money.

But, there is good news too. Some economists say, one of the reasons India was not affected the earlier recession is the 2009 general elections. Because election time is the time politicians bring their black money and distribute. So money was flowing in our country at the time of elections. If this right to recall comes to force, black money will be flowing with every election. But there is a catch, as each politician doubt being a MP for more than six months, he will be more corrupt to get all the spent money on elections back. We choose another one, and there is a fat chance that he is also corrupt, so we end up having more corrupted MP's in rotation than now.


   

Saturday, October 15, 2011

Indian Minerva గారి అభిప్రాయాలు పోస్ట్ కి నా పొడిగింపు


ఈ పోస్ట్ ,  అభిప్రాయాలు అని Indian Minerva రాసిన పోస్ట్ కి extension అన్నమాట. దాన్లో మనుష్యులకి ఉండే అభిప్రాయాలు వాటి రకాలు వివరించారు. 

నాకు తెలిసి అభిప్రాయాలలో మరో రకం Generalizations/Sweeping statements. ఉదాహరణకి , అందరు అమ్మాయిలు ఇంతే / all men are pigs , ముస్లిమ్స్ అందరు ఆతంకవాదులు , బ్రాహ్మణులు అందరికి కుల పిచ్చి జాస్తి , ఉత్తరాభారతీయులు తెల్లగా ఉంటారు / దక్షిన భారతీయులు నల్లగా ఉంటారు , తమిళులకి కొంచం పిచ్చి ఉంది , సీమంధ్ర వాళ్ళు అందరు దొంగలు / తెలంగాణా వాళ్ళు అందరు మూర్ఖులు , ఈ మగ జాతి మొత్తం ఆడవాళ్ళని తొక్కి పెట్టాలనే చూస్తుంది , అమెరికా ప్రపంచాన్ని నాశనం చెయ్యాలని చూస్తుంది , భారతదేశం లోని ముస్లిమ్స్ అందరు పాకిస్తాన్ కే సపోర్ట్ ఇస్తారు , గోదావరి జిల్లాల వాళ్ళు తడిగుడ్డతో గొంతులు కోసేస్తారు , నెల్లూరు లో అందరు నేరజాణలే, ఈ యూత్ చెడిపోయింది , తెలుగు వాళ్ళకి భాష మీద గౌరవం అస్సలు లేదు ,  పంజాబు వాళ్ళకి బుర్ర తక్కువ , భారతీయులకి బద్ధకం ఎక్కువ / జపాన్ లో అందరు కస్టపడి పని చేస్తారు , పెళ్లి అనగా బానిసత్వం , రిజర్వేషన్స్ లేకపోతే దళితులకి ఉన్న తెలివితేటలకి వాళ్ళు ఎప్పటికి ఎదగలేరు , కమ్మ్యునిజం లేకపోతే ఈ ప్రపంచం ముందుకు వేల్లేదే కాదు , ఈ పిల్లలు ఎప్పుడు కంపూటర్ల ముందే కూర్చుంటారు, అసలు వీళ్ళకి మనుష్యులతో మాట్లాడటం వస్తుందో రాదో , పుస్తకాలు చదవడం అందరు మానేసారు , etc etc . ఇలాంటివే మరికొన్ని ఇక్కడ

వీటిలో కొన్ని Indian Minerva గారి Fashionable/Radical section లోకి తోసేయ్యోచ్చు. ఏదో టీవీ ప్రోగ్రామ్స్ మీద ఇలాంటి అభిప్రాయాలు ఉంటె పర్లేదు కాని, పోలిటిక్స్ లో ఇలాంటి అభిప్రాయాలు పూర్తీ యదార్థం తెలుసుకోనీకుండా అడ్డుపడతాయి, ఆడవాళ్ళందరూ వంటిట్లో వంట లేకపోతే స్కూల్ టీచర్ గానే పనికి వస్తారు అని చిన్నపటినుంచి వింటూ వస్తున్న వ్యక్తికీ అధికారం ఇస్తే ? అలాగే , ముస్లిమ్స్ అందరు చెడ్డవాళ్ళు అని నమ్మే వ్యక్తి Minister of External affairs అయితే ? సీమంధ్రవాళ్ళు అందరు దొంగలు అని లేదా తెలంగాణా వాళ్ళు మూర్ఖులు అని నమ్మే వ్యక్తీ కి ప్రత్యెక తెలంగాణా సమస్య మీద పెట్టిన కమిటీ లో చోటు వస్తే ?

Thursday, October 13, 2011

ఎదురీత

కిశోర్ శాంతాబాయి కాళే ఆత్మకథ ఇది. ఇతనేమి ప్రముఖుడు కాదు. మహారాష్ట్ర లోని కొల్హాటి కులానికి చెందినవాడు ( అటు ఇటు గా కొల్హాటి వాళ్ళు అంటే భోగం వాళ్ళతో సమానం ) MBBS పూర్తీ చేసి , ఆ గ్రామానికే తిరిగి వచ్చి తన వారికి వైద్యం అందించిన డాక్టర్ కథ ఇది.

కొల్హాటి కుటుంబం లో ఆడదానిదే పూర్తీ బాధ్యత. సంపాదన , పని తనే చూసుకోవాలి, ఒక మగవాడు బయటకి వెళ్లి పని చెయ్యడం అనేది అవమానం గా భావించే కులం అది. అమ్మాయి రజస్వల అవ్వగానే తన కన్నేరికానికి బేరం కుదురుతుంది. అతనితోనే ఆ అమ్మాయి ఉండాలి , అతను వదిలేసేదాకా ! అలా వదిలివేయబడిన యువతీ తిరిగి అందరి ముందు నాట్యం చేయడం మొదలుపెడుతుంది, ఇంకో మగవాడు తనని కొనే దాకా అది సాగుతుంది. ఇది ఒక cycle. .

పుస్తక పరిచయం లో ఆ కులం గురించి బాగా వివరిస్తారు.

" కొల్హాటి కులం రాజస్థానీ సంచార తెగ. వాళ్ళు పశ్చిమ మహారాష్ట్ర కు వలస వచ్చారు, మొదట్లో గారడీ విద్యలను ప్రదర్శించి పొట్ట పోసుకునేవారు. తర్వాత ఆకర్షణీయమైన డాన్సింగ్ వృత్తిని ఎంచుకున్నారు . ఈ కులానికి చెందినా స్త్రీలని సంగీతం లోనో, నాట్యం లోనో శిక్షణ ఇచ్చి మగవాళ్ళను రంజింప చెయ్యడానికి బలవంతంగా నాట్య వృత్తిలోకి దించుతారు. కులం లోని మగవాళ్ళు ఆడవాళ్ళ సంపాదన మీద బతుకుతారు. తమ అక్క చెల్లె లని , కూతుళ్ళని దాన్సర్లుగా మారుస్తారు. కానే, భార్యల్ని మాత్రం కొల్హతి మగవాళ్ళు ఇల్లు కదలనివ్వరు. కొల్హతి మగవాళ్ళు తమ కులానికి చెందినా ఆడవాళ్ళను పెళ్ళాడటం చాలా అరుదు. సాధరణంగా ఊరూరు తిరుగుతూ వాళ్లకి ఇష్టం అయిన ఆడవాళ్ళను ఎత్తుకెళ్ళి 'మేలిని ' అనే సాధారణ ఉత్సవం ద్వారా ఆమెని కొల్హతి కులస్తురాలిని చేస్తారు. మగవాళ్ళు వాళ్ళకు ఒక చీరను బహుమతిగా ఇచ్చి పసుపుతో నలుగు పెడితే చాలు. ఆమె గర్భవతి అయ్యి బిడ్డను కన్నా తర్వాతే ఆమెను పెళ్ళాడతాడు , లేదంటే ఆమె పారిపోతుందేమో అన్న భయం

పెద్దమనిషి కాగానే 'కన్నెరికం ' కోసం వాళ్ళని అమ్మేస్తారు. వాళ్ళకు కడుపు వచ్చిన తర్వాత ఆ మగవాళ్ళు వదిలేస్తారు . అందుకనే ఎక్కువ మంది కొల్హాటి పిల్లలు తమ తల్లి పేరు పెట్టుకుంటారు. అక్రమ సంతానం అని తెలియజేసే పేర్లతో బడిలో తోటివాళ్ళ అవమానాలు తట్టుకోలేక బడి మానేసే పరిస్థితి "

కాని సమాజం లో వస్తున్న మార్పులని తట్టుకోలేని కొల్హాటి కులస్తులలో కొందమంది మగవాళ్ళు, పని చెయ్యకుండా ఇంట్లోని ఆడవాళ్ళ చేత వ్యభిచారం చేయించడం మొదలు పెడతారు  ( మగవాడు పనిచేయ్యకూడదు అన్న సంప్రదాయాన్ని పాటించారు)

అప్పటి సామజిక పరిస్తితుల గురించి  బాగా వివరాలు ఉన్నాయి ఈ పుస్తకం లో ...



చివరగా పుస్తకం వెనకాల డాక్టర్ కిశోర్ ని ప్రశంసిస్తూ , రిజర్వేషన్ పేరుతో కాళే లాంటి వాళ్ళకి చదువు, హాస్టల్ సదుపాయాలు అందించిన ప్రభుత్వాన్ని కూడా కాస్త మేచ్చుకోడం నాకు బాగా నచ్చింది.





Tuesday, October 11, 2011

Argumentative Indian By Amartya Sen

I borrowed this book from a friend in 2007 and just yesterday I get to finish it. Dont get the idea that this book is all about argumentative techniques. In the first chapter Amartya Sen tried to prove that we Indians argue a lot with references from history. The whole argumentative nature of Indians is mostly confined to that chapter only.

Later he talked about gender discrimination in india, our indian culture and heritage, how we usually treat our past, about ancient Indian Astronomy, Diaspora, the way history was presented in schools, how British Empire tried to prove their Intellectual superiority ( Author was against James Mill through out the book, John Mill is the one who wrote extensively about India, without visiting India and without learning Sanskrit or any other Indian Language. ).

Then there is boring chapter on India-china relations in the ancient times. And an equally boring chapter dedicated to calenders. He kept on talking about why we have chosen Saka calender instead of kaliyuga calender.  And his views on pokhran nuclear tests are little weird.

His opinions on understanding people from other culture are really interesting. And his arguments supporting secularism in India is a must read to all who call indian secularism as pseudo-secularism.

Seems Amartya Sen is very much influenced by Tagore and Akbar, and their references appear all over the book.. He made me realize that Tagore is more than just another poet with Noble Prize and Akbar is a true liberal. And now i have new found respect for those two  There is chapter about Reasoning and philosophers who specialized in it.

Over all its a good book. But the targeted readers are not Indians. Its for the students of other counties who are reading Indian History and culture. 

Saturday, October 01, 2011

Comparing Orkut, Facebook and Twitter

Orkut is more community based, its like joining a club of your interest, and start making friendship with like minded people.

Facebook is more like sitting in a cafe with my friends, where everybody has something to share, from copied quotations to personal views about something, you might like it or start a discussion about it.

Twitter is just like standing on a podium at cross roads and verbalizing thoughts with eyes closed. If people like your nonsense they will follow you, and if you hear your own nonsense, it means somebody retweeted you.