Showing posts with label telangana. Show all posts
Showing posts with label telangana. Show all posts

Sunday, March 22, 2020

ప్రజల మనిషి - తెలంగాణ మొదటి నవల

  వట్టికోట ఆళ్వారు స్వామి రచన. నైజాం రాజ్యం చివరి రోజులు చేరుకుంటున్నపుడు, గాంధీ మీద అందరికి నమ్మకం వస్తున్న సమయం, ఆర్యసామాజం స్థాపించిన కాలం, ప్రజాస్వామిక ఆలోచనలు పరిచయం అవుతున్న కాలం లో, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలలో రాయబడిన తెలంగాణా మొదటి నవల. 

సాంప్రదాయాలను ప్రశ్నించే ఒక బ్రాహ్మణ యువకుడు, సంక్షేమ పథకాల ఆశ చూపి జరుగుతున్న ఇస్లాం మత మర్పిడులని ప్రశ్నించి, రాజ్య ద్రోహం కేసు మీద జైలు కి వెళ్తాడు. తను దున్నుతున్న పొలం కాపాడటంలో ఒక కాపు కుర్రాడు, మతమర్పిడులకి వ్యతిరేకంగా పని చేసే ఆర్యసామాజం కుర్రాడు,  కుల అహంకారాన్ని, భూస్వామి తత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెడతాడు. వ్యక్తిగతంగా ఎదురయిన సంఘటనలు, మనిషి ఆలోచన విధానంలో, స్వభావం లో తీసుకొచ్చే మార్పులు, తద్వారా వారే న్యాయం కోసం పోరాటం చేయడం ఇలా సాగే కథ.