Tuesday, November 29, 2011

FDI & భారతదేశ స్వతంత్రం

"వర్తకం పేరుతో వచ్చి భారత దేశాన్ని బానిసత్వపు సంకెళ్ళతో కేట్టేసిన తెల్ల కుక్కలు " --------- అసలు కత్తి డయలాగు ఇది. కాని దీన్లో మొత్తం నిజం ఉందా ?

FDI , international trade అనగానే , మళ్ళి మిగతా ప్రపంచంతో వర్తకం చేయడం వల్ల భారతదేశం తన స్వయంప్రతిపత్తిని కోల్పోతుందా అనే అనుమానాలు  చాలా మందికి ఉన్నాయి అని నాకు ఈ మధ్యనే అర్థం అవుతోంది.

వర్తకం చేయడం వల్ల మనం స్వతంత్రాన్ని కోల్పోలేదు . మిరియాలు, ఏలకులు , నల్ల మందు వర్తకం జరిగినంత కాలం బాగానే ఉంది. ఎప్పుడయితే బ్రిటిషు వారికి , ఫ్రెంచు వారికి , కోటలు కట్టుకోడానికి,  ఇక్కడ వాళ్ళు సైన్యం మైంటైన్ చేయడానికి అనుమతి ఇవ్వబడిందో , ఎప్పుడయితే ఇంకో భారత దేశ రాజుని ఓడించడానికి వాళ్ల సహాయం తీసుకుని, తమ రాజ్యం లో కప్పం వసూలు చేసుకోడానికి అనుమతి ఇవ్వడం మొదలు పెట్టారో అప్పుడు భారత దేశం స్వతంత్రం కోల్పోడం మొదలు పెట్టింది.

కాని ఇప్పుడు అదే పరిస్థితి ఉందా ? వచ్చిన MNC's కి tax వసూలు చేసే అధికారం , వారి సొంత ఆర్మీ పెట్టుకునే అధికారం లేనంత కాలం , FDI అనేది బానిసత్వంని  భారతదేశం మీదకి రుద్దుతుంది అని భయపడక్కర్లేదనుకుంటా .

అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి , ఒప్పుకుంటా . కాని సరయిన పాఠం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి మోసం చేసాడు అని , ఇక ఎవరితోను మాట్లాడను, ఎవరి మాటా వినిపించుకోకుండా చేవుల్లు దూదులు పెట్టుకుని మాత్రమే తిరుగుతా అనడం సరి కాదు , ఎదుటి వాడు నిజం చెబుతున్నాడా లేదా అని తెలుసుకోగలిగే విజ్ఞత తెచ్చుకోవడం సరి అయిన పాఠం

Friday, November 25, 2011

వాల్మార్ట్ కిరాణా & జనరల్ స్టోర్స్

వాల్మార్ట్ వస్తే మన కిరాణా & జనరల్ స్టోర్స్ మూత పడతాయా ? ఇన్ని మోర్ సూపర్ మార్కెట్స్ ఉన్నా చావని కిరాణా కొట్టు , వాల్మార్ట్ కి తల వంచుతుందా ?

pepe jeans, reebok , nike , adidas , peter england , van heusen and pan america brands రావటం వల్ల , మన చర్మాస్ , kumar shirts, jc brothers, bommana brothers, neerus , పుచ్చల సిల్క్స్ , రాజమండ్రి లో సినిమాలు , టీవీ సీరియల్ పేర్లతో చీరలు అమ్మే దుకాణాలు నడవడం మనేసాయా?

పది సంవత్సరాల క్రితం కంపూటర్లు వల్ల ఉన్న ఉద్యోగాలు పోయి, నిరుద్యోగం పెరుగుతుంది అన్న వాదన నిజమయినదా ? అప్పుడు ప్రజలు భయపడినట్టే  జరిగిందా ?

ఇలా వాల్మార్ట్ రాగానే అలా ప్రజలంతా అక్కడికి వెళ్లి ఉప్పులు పప్పులు కొంటారా ? ఎక్కడో ఉండే వాల్మార్ట్ కి వెళ్లి VAT తో కలిపిన బిల్ కడతారా లేక ఇంటిదగ్గర కిరాణా కొట్టులో బిల్ లేకుండా కొంటారా ?


Thursday, November 17, 2011

అసలు ప్రభుత్వం ఏం చెయ్యాలి అంటే ......

ప్రభుత్వం పనుల్లో ముఖ్యంగా సైన్యాన్ని , law and order ని మైంటైన్ చెయ్యడం . ఇవి కాకుండా ప్రభుత్వం చాలా చేయ్య్యాలి .

బుర్ర పగలకుండా హెల్మెట్ పెట్టుకోమని ప్రభుత్వమే చెప్పాలి, పిల్లలకి పోలియో రాకుండా మందులు ప్రభుత్వమే పంచాలి , దోమలు ఎక్కువకకుండా ఉండటానికి నీళ్ళు నిలువ ఉంచకండి అని ప్రభుత్వమే చెప్పాలి, అలా కాకుండా దోమలు ఎక్కువయితే దోమల మందు ప్రభుత్వమే కొట్టాలి . తక్కువ ధరకే విత్తనాలు, ఎరువులు , కరెంటు , నీళ్ళు ఇచ్చి , ఒకవేళ సరయిన మద్దతు ధర మార్కెట లో లభించకపోతే ప్రభుత్వమే ఆ పంటని కొని, గోదాముల్లో పెట్టుకోవాలి . చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయొద్దని ప్రభుత్వమే చెప్పాలి, పిల్లల్ని చదివించమని చెప్పాలి, వాళ్ళకి ఉచితంగా స్చూల్స్ కట్టాలి,  వాళ్లకి స్కూల్ లో భోజనాలు పెట్టాలి, ఆడపిల్లలని చంపోద్దని చెప్పాలి, మగ పిల్లలని అమ్ముకోవద్దని చెప్పాలి, తాగి డ్రైవ్ చెయ్యొద్దని, ఎయిడ్స్ రాకుండా కండోమ్స్ వాడమని కూడా ప్రభుత్వమే చెప్పాలి, కరువు వరదలు వచినపుడు రుణాలు మాఫీ చెయ్యాలి , NREGA లాంటి ప్రోగ్రామ్స్ మైంటైన్ చెయ్యాలి, నిమ్న కులస్తులకి చదువుకోడానికి స్కాలర్షిప్స్ ఇవ్వాలి, వాళ్ల చదువు పూర్తీ అయ్యాక ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలి, ఇంకా ఫ్రీ గా టీవీలు , తక్కువ ధరకే టాబ్లెట్ ఫోన్స్  అందించాలి, మనం వంట చేసుకుని తినడానికి గ్యాస్ , నడపడానికి కార్లో డీసిల్,  తక్కువ సబ్సిడి కే ఇవ్వాలి ,   ఇవి కాకుండా ఆస్పత్రి వసతులు, గ్రంధాలయాలు , పార్కులు కట్టాలి, మరుగు దొడ్లు కట్టాలి, ఆనకట్టలు కట్టాలి, పేద వారికి ఇళ్ళు  కట్టివ్వాలి, ప్రభత్వ ఉద్యోగులకి కూడా కట్టివ్వాలి , స్థలాలు పంచాలి , ఆడవారికి ముసలి వారికి పన్నులో రాయితి ఇవ్వాలి, అర్తికపన్ను తగ్గించుకోడానికి చిన్నమొత్తాల పొదుపు, ఇందిరా వికాస పత్రం లాంటి ప్రోగ్రాములు పెట్టాలి , యునివేర్సిటీలు , కళాశాలలు పెట్టాలి, అక్కడ రిసెర్చ్ చేసే వాళ్ళకి ఆర్ధిక సహాయం చెయ్యాలి , బస్సులు రైళ్ళు నడపాలి, వాటిలో ముసలివారికి వికలాంగులకి రాయితి కల్పించాలి , వార్డ్ దగ్గరనుంచి , లోక్ సభ దాకా ఎన్నికలు నిర్వహించాలి ....ఇంకా ఇలాంటివి బోలెడు చెయ్యాలి .

ప్రజలుగా మనమేం చెయ్యాలి ? పన్ను కట్టాలి, వోటు వెయ్యాలి . 2009 లో వోటు వేసినవారు 59.7%, మొత్తం పన్ను కట్టే వారు అటు ఇటు గా 2.5% .  అదీ  సంగతి.


Friday, November 04, 2011

United we fall !!

With EU leaders discussing to keep Greece in Eurozone or not, the collectivism with binding economic-legal bond at international level proves to be wrong idea again.

Most people thought that the collapse of USSR is because of the dictatorship of few mindless policy makers, it could be one of the reasons but from the angle of current eurozone crisis it appears that, the collectivism which was the idea behind both USSR and EU was wrong. Probably in international economy "united we stand, divided we fall " motto does not work.

Earlier some of  the SAARC leaders supported the idea of EU like economic and political reforms in South Asia. It was dropped later.

 The problem with common currency is, the nation which is facing financial crisis cant devalue its currency like China do. If Greece was not in the Eurozone, to handle the debt crisis it would have devalued its currency to let the economy flow at the domestic level. In the absence of Eurozone, other countries dont have to share the burden created by Greece and Italy. If Greece is out of EU, then Italy is next in line.

Anyway, with the Eurozone crisis,  Ayn Rand leading with 2 - 0  against karl Marx in International Trade match. (She scored one point when USSR collapsed)